సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) బుధవారం కాంపాక్ట్ ఎఎస్‌యూవీ విటారా బ్రెజ్జాను సరికొత్తగా పరిచయం చేసింది. పాదచారుల భద్రతతో సహా, ఆధునిక భద్రతా నిబంధనలతో కొత్త అల్లాయ్ వీల్స్, నిగనిగలాడే నలుపు రంగు ఫినీషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా విడుదల చేసింది. ఈ మేకోవర్ స్పోర్టీ బ్రెజ్జా వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ+ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. రూ. 8.54 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య వీటి ధరలను నిర్ణయించింది.
ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మెరుగు పర్చడంతోపాటు అడ్వాన్స్‌డ్ సేఫ్టీ మెజర్స్‌ను పొందుపరిచింది. రిఫ్రెష్ విటారా బ్రెజ్జాలో ISOFIX చైల్డ్ లాకింగ్ సిస్టం , హై స్పీడ్ వార్నింగ్ ఎలర్ట్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్స్‌తో కూడిన కొత్త భద్రతా ఫీచర్స్‌ను జోడించినట్టు కంపెనీ తెలిపింది.భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా ఉన్న బ్రెజ్జాను ఆటోగేర్ షిఫ్ట్, టూ పెడల్ టెక్నాలజీ మేళవింపుతో యువ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు ఆర్‌ఎస్ కల్సీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఏజీస్ వేరియంట్ విక్రయాలు మూడింతలు పెరిగినట్టు పేర్కొన్నారు.
కాగా 2016లో ప్రారంభించిన విటారా బ్రెజ్జా మొత్తం 2.75 లక్షల యూనిట్లు విక్రయించింది. 2017-18లో 1,48,462 యూనిట్లను విక్రయించింది. దీని సగటు నెలవారీ అమ్మకాలు 12,300 యూనిట్లుగా ఉన్నాయి. టాప్ వేరియంట్ సేల్స్ మొత్తం అమ్మకాలలో 56 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment