AGS
-
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఐపీవో 19న
న్యూఢిల్లీ: పేమెంట్ సొల్యూషన్స్ అందించే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభంకానుంది. 21న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 680 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే తొలుత రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని వేసిన ప్రణాళికలను తాజాగా సవరించుకుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌తోపాటు, ప్రస్తుత వాటాదారులు రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రవి బి.గోయల్ రూ. 677 కోట్లకుపైగా విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. తొలుత రూ. 792 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించాలని ప్రణాళికలు వేయడం గమనార్హం. కాగా.. కంపెనీ సమీకృత ఓమ్నీ చానల్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, కార్పొరేట్లకు డిజిటల్, నగదు ఆధారిత సొల్యూషన్స్ సమకూర్చుతోంది. ఇంతక్రితం 2015లో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్ రూ. 1,350 కోట్ల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2018లో ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందింది. అయితే ఈ ప్రణాళికలను అమలు చేయలేదు. -
మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌తో సహాయంతో పూర్తి కాంటాక్ట్‌లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్‌లో పిన్ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్‌వర్క్‌లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్‌లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు -
మార్కెట్లోకి మారుతీ స్విఫ్ట్ ఏజీఎస్ వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్ మోడళ్లలో ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.76 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ, వీడీఐ, జడ్డీఐ వేరియంట్లలో ఏజీఎస్ ట్రాన్సిమిషన్ సౌకర్యాన్ని అందించామని తెలిపింది. ఇప్పుడు తాజాగా స్విఫ్ట్ హై ఎండ్ మోడళ్లు–జడ్ఎక్స్ఐ ప్లస్, జడ్డీఐప్లస్ వేరియంట్లలో కూడా ఈ ఏజీఎస్ ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపింది. దీంతో స్విఫ్ట్ బ్రాండ్ మరింత పటిష్టమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మారుతీ కంపెనీ స్విఫ్ట్‌ను 2005లో మార్కెట్లోకి తెచ్చింది. -
మారుతి విటారా బ్రెజ్జా: కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) బుధవారం కాంపాక్ట్ ఎఎస్‌యూవీ విటారా బ్రెజ్జాను సరికొత్తగా పరిచయం చేసింది. పాదచారుల భద్రతతో సహా, ఆధునిక భద్రతా నిబంధనలతో కొత్త అల్లాయ్ వీల్స్, నిగనిగలాడే నలుపు రంగు ఫినీషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా విడుదల చేసింది. ఈ మేకోవర్ స్పోర్టీ బ్రెజ్జా వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ+ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. రూ. 8.54 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య వీటి ధరలను నిర్ణయించింది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను మెరుగు పర్చడంతోపాటు అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్‌ను పొందుపరిచింది. రిఫ్రెష్ విటారా బ్రెజ్జాలో ISOFIX చైల్డ్ లాకింగ్ సిస్టం , హై స్పీడ్ వార్నింగ్ ఎలర్ట్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్స్‌తో కూడిన కొత్త భద్రతా ఫీచర్స్‌ను జోడించినట్టు కంపెనీ తెలిపింది.భారత ఎస్యూవీ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా ఉన్న బ్రెజ్జాను ఆటోగేర్ షిఫ్ట్, టూ పెడల్ టెక్నాలజీ మేళవింపుతో యువ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు ఆర్ఎస్ కల్సీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఏజీస్ వేరియంట్ విక్రయాలు మూడింతలు పెరిగినట్టు పేర్కొన్నారు. కాగా 2016లో ప్రారంభించిన విటారా బ్రెజ్జా మొత్తం 2.75 లక్షల యూనిట్లు విక్రయించింది. 2017-18లో 1,48,462 యూనిట్లను విక్రయించింది. దీని సగటు నెలవారీ అమ్మకాలు 12,300 యూనిట్లుగా ఉన్నాయి. టాప్ వేరియంట్ సేల్స్ మొత్తం అమ్మకాలలో 56 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. -
ఏజీఎస్ టెక్నాలజీతో మారుతీ డి జైర్
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) టెక్నాలజీతో కూడిన టాప్ ఎండ్ మారుతీ స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డీఐ డీజిల్ సెడాన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.39 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఏజీఎస్ టెక్నాలజీతో వస్తున్న కంపెనీ తొలి డీజిల్ కారు డిజైర్. అలాగే ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఏజీఎస్ టెక్నాలజీతో వస్తున్న 4వ మోడల్ కారు కూడా. ఏజీఎస్తో కూడిన డిజైర్ కార్లు లీటర్‌కు 26.59 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.