
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్ మోడళ్లలో ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.76 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ, వీడీఐ, జడ్‌డీఐ వేరియంట్లలో ఏజీఎస్ ట్రాన్సిమిషన్ సౌకర్యాన్ని అందించామని తెలిపింది.
ఇప్పుడు తాజాగా స్విఫ్ట్ హై ఎండ్ మోడళ్లు–జడ్‌ఎక్స్‌ఐ ప్లస్, జడ్‌డీఐప్లస్ వేరియంట్లలో కూడా ఈ ఏజీఎస్ ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపింది. దీంతో స్విఫ్ట్ బ్రాండ్ మరింత పటిష్టమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మారుతీ కంపెనీ స్విఫ్ట్‌ను 2005లో మార్కెట్లోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment