Maruti Swift
-
మీకు తెలుసా? ఈ కారును భారత్‌లో 30లక్షల మంది కొన్నారు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి స్విఫ్ట్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా కంపెనీ 2005లో తన స్విఫ్ట్ కారును ప్రారంభించింది. ఆ తరువాత ఇప్పటివరకు అనేక అప్డేట్స్ పొందూతూ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. దీంతో భారతదేశంలో స్విఫ్ట్ సేల్స్ 30లక్షల యూనిట్లకు చేరుకుంది.అమ్మకాల్లో స్విఫ్ట్ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. లక్షలాది మంది స్విఫ్ట్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్విఫ్ట్ యజమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. త్వరలో CNG రూపంలో కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే.. 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.4 Bhp పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం. ఈ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!
ఇటీవల కార్ల వాడకం పెరుగుతోంది. ఇదివరకు కస్టమర్లు స్టైలిష్ లుక్, సాకర్యాలు, ఫీచర్ల, ధరను చూసేవాళ్లు. ప్రస్తుతం ఇంధన ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఓ కన్నేస్తున్నారు. కొంతవరకు, (CNG) సీఎన్జీ ఇంధనం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం కొంచెం ఖరీదుగా ఉండడం, పైగా వాటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఎక్కువ మంది కంపెనీలు తమ దృష్టిని హైబ్రిడ్ టెక్నాలజీ కార్ల వైపు మళ్లిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో అదిరిపోయే మైలేజ్‌తో ఉన్న కార్లు మార్కెట్లో విడుదలకు తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మారుతి నుంచి ఆ రెండు కార్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్, డిజైర్ మారుతి కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కస్టమర్లు కోరుకునే బడ్జెట్ ధరలతో పాటు ఫీచర్లు, కార్ల పనితీరు కారణంగా ఇవి సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. తదపరి మారుతి నుంచి స్విఫ్ట్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్నాయని నివేదికలు చెప్తున్నాయి. మారుతి ఈ రెండు మోడళ్లలో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ కార్ల ఇంజిన్లు కూడా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు కావచ్చని సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ హైబ్రిడ్ మోడల్ కార్లు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనాలుగా మారనున్నాయి. ఇవి 35 km/l నుంచి 40 km/l వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ , డిజైర్ 2024 తొలి త్రైమాసికంలో మార్కెట్లో రావొచ్చు. ప్రస్తుతం మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా SUV 27.97 కిమీ/లీతో ఫ్యూయల్ ఎకానమీ చార్ట్‌లలో ముందుంది. ఇదిలా ఉండగా మారుతీ సుజుకీ మాత్రం ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే! -
మార్కెట్లోకి మారుతీ స్విఫ్ట్ ఏజీఎస్ వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ స్విఫ్ట్‌కి చెందిన హై ఎండ్ మోడళ్లలో ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) సౌకర్యమున్న కార్లను మార్కెట్లోకి తెచ్చింది. దీంట్లో పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.76 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.8.76 లక్షలని (రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మారుతీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొంది. అప్పుడే స్విఫ్ట్‌కు చెందిన వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ, వీడీఐ, జడ్డీఐ వేరియంట్లలో ఏజీఎస్ ట్రాన్సిమిషన్ సౌకర్యాన్ని అందించామని తెలిపింది. ఇప్పుడు తాజాగా స్విఫ్ట్ హై ఎండ్ మోడళ్లు–జడ్ఎక్స్ఐ ప్లస్, జడ్డీఐప్లస్ వేరియంట్లలో కూడా ఈ ఏజీఎస్ ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపింది. దీంతో స్విఫ్ట్ బ్రాండ్ మరింత పటిష్టమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. మారుతీ కంపెనీ స్విఫ్ట్‌ను 2005లో మార్కెట్లోకి తెచ్చింది. -
ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్
న్యూఢిల్లీ : మార్కెట్లో మారుతీ సుజుకీ కార్ల హవా అంతా ఇంతా కాదు. పోటీపడి మరీ ఆ దిగ్గజ కార్లు టాప్ ప్లేస్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండే ఆల్టోను తన తోబుట్టువు స్విఫ్ట్ బీట్ చేసింది. ఏప్రిల్ నెలలో మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా స్విఫ్ట్ నిలిచింది. 10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఏడు మారుతీ సుజుకీవే చోటు దక్కించుకున్నాయి. మిగిలిన మూడు స్థానాలు మారుతీ సుజుకీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్లు ఉన్నాయి. సియామ్ తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ కార్లు 23,802 యూనిట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. ముందటేడాది ఇదే నెలలో ఇవి 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాదికి 51.98 శాతం అమ్మకాలను పెంచుకుంది ఈ మోడల్. ఆల్టో మోడల్ 22,549 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి 35.97 శాతం. 2016 ఏప్రిల్ లో ఆల్టో నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్. ఆ సమయంలో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేంది. ప్రస్తుతం ఆల్టోను స్విఫ్ట్ బీట్ చేసింది. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బెలానో మూడో స్థానంలో 17,530 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా.. ఇది ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చేసింది. వాగన్ ఆర్ 4వ స్థానం, హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10లు, ఐదు ఆరు స్థానాలు, మారుతీ సుజుకీ విటారా బ్రిజా 7వ స్థానం, హ్యుందాయ్ క్రిటా 8వ స్థానం, మారుతీ సుజుకి డిజైర్ టూర్ 9వ స్థానం, సెలెరియో 10వ స్థానం దక్కించుకున్నాయి. -
ఆయుధాలతో బెదిరించి భారీ చోరీ
ఆగ్రా: నలుగురు దుండగులు కారును అడ్డగించి వారి వద్ద ఉన్న రూ.46 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఫిరోజాబాద్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నాం చోటుచేసుకుంది. ఎస్పీ ప్రీతేంద్ర సింగ్ కథనం ప్రకారం.. ఆగ్రాలోని బ్యాంకులో నగదు డ్రా చేసుకుని ఫిరోజాబాద్ లోని గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా కొందరు సాయుధులు తమను అడ్డగించారని బాధితులు తెలిపారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా మరో వాహనం తమ స్విఫ్ట్ కారును ఓవర్ టెక్ చేసిందని, అందులో నుంచి దిగిన కొందరు దుండుగులు తమ కారుని నిలిపివేశారని చెప్పారు. అనంతరం ఆయుధాలతో తమను బెదిరించి కారులో ఉన్న నగదు బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ వివరించారు. -
మారుతీ స్విఫ్ట్‌లో కొత్త వేరియంట్
ధరల శ్రేణి రూ.4.42 లక్షలు-రూ.6.95 లక్షలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ స్విఫ్ట్ మోడల్లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కొత్త స్విఫ్ట్‌ను అందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్. ఎస్. కల్సి చెప్పారు. పెట్రోల్ కారు ధరలు రూ.4.42 లక్షల నుంచి రూ.5.9 లక్షలు, డీజిల్ కారు ధరలు రూ.5.56 లక్షల నుంచి రూ.6.95 లక్షలు (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని వివరించారు. మైలేజీ 10 శాతం అధికంగా వచ్చే ఈ కొత్త స్విఫ్ట్ కారులో పుష్ స్టార్ట్ బటన్, వెనక సీట్‌ను 60:40 నిష్పత్తిలో స్ప్లిట్ చేసుకునే వెసులుబాటు, రివర్స్ పార్కింగ్ సెన్సర్, రీట్రాక్టబుల్ అవుట్‌సైడ్ మిర్రర్లు తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ కొత్త కారు 25.2 కి.మీ. మైలీజీ(డీజిల్ వేరియంట్)నిస్తుందని తెలిపారు. మొదటగా స్విఫ్ట్ మోడల్‌ను 2005, మేలో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 12 లక్షల కార్లను విక్రయించామని వివరించారు. -
టాప్ గేర్‌లో మారుతీ..
- ఆగస్టులో జోరుగా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు - పండుగల సీజన్‌పై ఆశలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు పుంజుకుంటున్నాయి. సెంటిమెంట్ మెరుగుపడడంతో మారుతీ సుజుకి, హోండా కార్స్, హ్యుందాయ్, నిస్సాన్, ఫోర్డ్ ఇండియా కార్ల కంపెనీల దేశీయ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో మంచి వృద్ధిని సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, ఫోర్డ్ ఇండియా, జనరల్ మోటార్స్, తదితర కంపెనీల దేశీయ అమ్మకాలు మాత్రం క్షీణించాయి. మారుతీ సుజుకి కాంపాక్ట్ కార్లు(స్విఫ్ట్, ఎస్టిలో, సెలెరియో, రిట్జ్, డిజైర్ కార్ల) అమ్మకాలు 53 శాతం పెరగడం విశేషం. మొత్తం మీద మారుతీ దేశీయ అమ్మకాలు 27 శాతం పెరిగాయి. గత నెలలో కూడా మారుతీ అమ్మకాలు మెరుగుపడ్డాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు మాత్రం 19 శాతం పెరిగాయి. అయితే మొత్తం అమ్మకాల(దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి) విషయంలో ఆగస్టు నెల వివిధ కంపెనీలకు మిశ్రమ ఫలితాలనిచ్చింది. ఇక టూవీలర్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలన్నీ విక్రయాల్లో 20 శాతానికి మించి వృద్ధి సాధించాయి. పండుగ సీజన్లో మరింత జోరుగా ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని, ఈ ప్రభావం వాహనాల కొనుగోళ్లపై ఉంటోందని నిపుణులంటున్నారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఉండే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) డిమాండ్ పెరిగి వాహన విక్రయాలు జోరుగా ఉంటాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. పెట్రోల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడం, కొత్త మోడళ్లు, మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్ తదితర అంశాల కారణంగా పండుగల సీజన్ సందర్భంగా అమ్మకాలు బాగుంటాయనే ఆశాభావాన్ని వివిధ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని దీంతో వాహన మార్కెట్లో వ్యాపార విశ్వాసం మెరుగైందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోగలవని పేర్కొన్నారు. పండుగల సీజన్ సందర్భంగా కొత్త మోడళ్లను, అప్‌గ్రేడ్ వేరియంట్లను మొత్తం 10 కొత్త ఉత్పత్తులను అందించనున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలు... • ఐషర్ మోటార్స్ దేశీయ అమ్మకాలు 66% పెరి గాయి. ఎగుమతులు 47% వృద్ధి చెందాయి. • మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 27 శాతం, ఎగుమతులు 10 శాతం చొప్పున పెరిగాయి. • హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 19% పెరగ్గా, ఎగుమతులు 40% తగ్గాయి. ఎలైట్ ఐ20, ఎక్సెంట్, గ్రాండ్ వంటి కొత్త కార్లకు మంచి స్పందన లభిస్తోందని కంపెనీ పేర్కొంది. • మహీంద్రా దేశీయ అమ్మకాలు 7% తగ్గాయి. • టయోటా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. • నెలా నెలా తమ అమ్మకాలు పెరుగుతున్నాయని హోండా కార్స్ ఇండియా పేర్కొంది. రానున్న నెలల్లో అమ్మకాల్లో మరింత వృద్ధిని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది.