దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి స్విఫ్ట్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా కంపెనీ 2005లో తన స్విఫ్ట్ కారును ప్రారంభించింది. ఆ తరువాత ఇప్పటివరకు అనేక అప్డేట్స్ పొందూతూ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. దీంతో భారతదేశంలో స్విఫ్ట్ సేల్స్ 30లక్షల యూనిట్లకు చేరుకుంది.
అమ్మకాల్లో స్విఫ్ట్ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. లక్షలాది మంది స్విఫ్ట్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్విఫ్ట్ యజమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఇప్పటి వరకు పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. త్వరలో CNG రూపంలో కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే.. 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.4 Bhp పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం. ఈ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment