ఏజీఎస్ టెక్నాలజీతో మారుతీ డి జైర్
న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తాజాగా ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్) టెక్నాలజీతో కూడిన టాప్ ఎండ్ మారుతీ స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డీఐ డీజిల్ సెడాన్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.39 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఏజీఎస్ టెక్నాలజీతో వస్తున్న కంపెనీ తొలి డీజిల్ కారు డిజైర్. అలాగే ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఏజీఎస్ టెక్నాలజీతో వస్తున్న 4వ మోడల్ కారు కూడా. ఏజీఎస్‌తో కూడిన డిజైర్ కార్లు లీటర్‌కు 26.59 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది.