న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన పరిశ్రమ 2030–31 నాటికి భారత్‌లో 60–70 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకే యూచీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే దాదాపు రెండింతల కార్యకలాపాలు పెరుగుతాయ ని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలకడగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చే మార్గాలను కనుగొనాలని ఏసీఎంఏ సదస్సులో పిలుపునిచ్చారు. ‘విడిభాగాల తయారీ పరిశ్రమ దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం, వ్యాపార విస్తరణ, వృద్ధికి ఇప్పటికే ఉన్న మానవశక్తి నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి కొత్త సాంకేతికతలు, ఇంధనాలను స్వీకరించడానికి దారితీస్తున్నాయి. తద్వారా ముఖ్యంగా భారతీయ ఆటో విడిభాగాల తయారీదార్లకు పెద్ద అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ’మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రతిరూపాలలో మీరు ఒకరు. ఇప్పుడు తయారీ నైపుణ్యాన్ని సంపాదించిన తర్వా త మనం ’డిజైన్ ఇన్ ఇండియా’ వైపు మళ్లాలి. భారత్‌లో భారీ టాలెంట్ పూల్ ఉంది. కానీ వారిని పరిశ్రమకు సిద్ధం చేయడానికి ముడిపడి ఉన్న అన్ని సంస్థలతో అనుసంధానం అవసరం. ప్రభుత్వం నుండి కూడా క్రియాశీల మద్దతు కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment