Passenger Vehicle
-
2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: 2024 సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు(Vehicle sales) రికార్డు స్థాయిలో 43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2023 ఏడాదిలో విక్రయించిన 41.09 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 4.64% అధికంగా ఉంది. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు అధిక గిరాకీ, గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్(Demand) బలంగా ఉండడం కలిసొచ్చింది. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata Motors), టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియాలు గతంలో ఎన్నడూ చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి. ఇదీ చదవండి: కంపెనీల విడదీత.. లాభాల మోత!మారుతీ సుజుకీ 2024లో 17,90,977 వాహనాలు విక్రయించింది. అంతకు ముందు 2018లో అమ్ముడైన 17,51,919 యూనిట్ల అమ్మకాల రికార్డు బద్దలైంది. కాగా 2023లో కంపెనీ మొత్తం 17,26,661 వాహనాలను విక్రయించింది.గత క్యాలెండర్ ఏడాదిలో హ్యుందాయ్ మోటార్ రికార్డు స్థాయిలో 6,05,433 యూనిట్లు విక్రయించింది. వీటిలో ఎస్యూవీ విభాగపు వాటా 60.6 శాతంగా ఉంది. కాగా 2023లో 6,02,111 విక్రయాలు నమోదయ్యాయి. -
చల్ ‘వాహన’ రంగా..!
ప్యాసింజర్ వాహనాలకు (పీవీ) సంబంధించి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ ఎదిగింది. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) వాటా ఇందులో దాదాపు సగం స్థాయిలో ఉంటోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 43 లక్షల యూనిట్లుగా ఉన్న పీవీల మార్కెట్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి అరవై లక్షలకు చేరొచ్చని, ఇందులో 20–21 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే (ఈవీ) ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాల డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం, పర్యావరణ అనుకూల కొత్త టెక్నాలజీలను వినియోగంలోకి తేవడంపై ఆటోమొబైల్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఇందుకోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.ఈవీలు, ఐసీఈలపై మారుతీ కసరత్తు.. మారుతీ సుజుకీ ఎస్యూవీ కేటగిరీలో తొలి ఈవీని గతేడాదే ఆవిష్కరించనున్నట్లు తొలుత ప్రకటించినా అది ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడింది. 2029–30 నాటికి మొత్తం ఆరు ఈవీలను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 50 శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునే క్రమంలో సామర్థ్యాల పెంపు, కొత్త మోడళ్ల అభివృద్ధి మొదలైన వాటిపై 2024–25లో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సి ంహభాగం వాటా హరియాణా నాలోని ఖార్ఖోడా ప్లాంటుపైనే వెచ్చించనుంది. 2025 నాటికి ఇందులో ఉత్పత్తి ప్రారంభం కానుండగా, సంస్థకు ఏటా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం జత కానుంది. ఎంఎస్ఐఎల్ ప్రస్తుతం గురుగ్రామ్, మానెసర్, హన్సల్పూర్ (గుజరాత్) ప్లాంట్లలో ఏటా 23.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు, మోడళ్ల శ్రేణిని 28కి పెంచుకునేందుకు 2030–31 నాటికి రూ. 1.25 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. టాటా మోటార్స్ 6 ఈవీలు... టాటా మోటార్స్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీలపై రూ. 16,000–18,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ విక్రయిస్తున్న కంపెనీ 2026 మార్చి నాటికి మరో ఆరు ఈవీలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. 2030 నాటికి పీవీ మార్కెట్లో 20 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.ఎంఅండ్ఎం రూ. 12,000 కోట్లు.. ఈవీల విభాగం మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్‌పై వచ్చే మూడేళ్లలో రూ. 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనకు ఎంఅండ్ఎం బోర్డు ఆమోదముద్ర వేసింది. 2025 తొలి త్రైమాసికంలో కంపెనీ తమ తొలి ‘బార్న్ ఈవీ’ శ్రేణిని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2027 నాటికి ఎంఅండ్ఎం అమ్మకాల్లో ఈవీల వాటా 20–30% ఉంటుందని అంచనా. 2030 నాటికి తొమ్మిది ఎస్‌యూవీలను, ఏడు బార్న్ ఎలక్ట్రిక్ వాహనాలను, ఏడు తేలికపాటి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టేందుకు 2024–25 నుంచి 2026–27 మధ్య కాలంలో రూ. 27,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. ఇందులో ఐసీఈ వాహనాల కోసం రూ. 8,500 కోట్లు వెచ్చించనుంది.హ్యుందాయ్.. సై.. త్వరలో భారీ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వచ్చే 10 ఏళ్లలో రూ. 32,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తమిళనాడు ప్లాంటు సామర్థ్యాల పెంపు, విడిభాగాల వ్యవస్థ, ఈవీల తయారీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటిపై రూ. 26,000 కోట్లు, జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసిన తాలేగావ్ ప్లాంటుపై రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.లిస్టులో మరిన్ని కంపెనీలు.. » జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త తరహా ఎనర్జీ వాహనాలను (ఎన్ఈవీ), ఐసీఈ వాహనాలను అభివృద్ధి చేసేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. » కియా ఇండియా 2025లో ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపొందించిన ఈవీని ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. » ఆరు వాహనాల అభివృద్ధి కోసం భారత్‌లో రూ. 5,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు నిస్సాన్, రెనో గతేడాది ప్రకటించాయి. వీటిలో రెండు ఈవీలు కూడా ఉండనున్నాయి. » ఇక ద్విచక్ర వాహనాలు, ఈవీల కోసం అవసరమయ్యే పరికరాల ఉత్పత్తి కోసం విడిభాగాల తయారీ సంస్థలు వచ్చే మూడు–నాలుగేళ్లలో రూ. 25,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇందులో 45–50 శాతం మొత్తాన్ని బ్యాటరీ సెల్స్ తయారీపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. -
వాహనాలకు పండుగ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు అక్టోబరులో రికార్డు స్థాయిలో పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. పటిష్ట పండుగ సీజన్ డిమాండ్ ఇందుకు దోహదం చేసిందని వెల్లడించింది. ‘గత నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ సంఖ్య 3,89,714 యూనిట్లు. 2022 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 16 శాతం అధికం. త్రిచక్ర వాహనాలు 42 శాతం ఎగసి 76,940 యూనిట్లను తాకాయి. ఒక నెలలో ఈ స్థాయి యూనిట్లు హోల్‌సేల్‌లో విక్రయం కావడం ఇదే తొలిసారి. ద్విచక్ర వాహనాలు 20 శాతం అధికమై 18,95,799 యూనిట్లుగా ఉంది. ఈ మూడు విభాగాలు అక్టోబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి ఊపందుకోవడం పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వ స్థిర అనుకూల విధానాలు, కొనసాగుతున్న పండుగల సీజన్‌తో ఇది సాధ్యమైంది’ అని సియామ్ తెలిపింది. -
2030–31 నాటికి 70 లక్షల కార్లు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన పరిశ్రమ 2030–31 నాటికి భారత్‌లో 60–70 లక్షల యూనిట్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకే యూచీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే దాదాపు రెండింతల కార్యకలాపాలు పెరుగుతాయ ని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలకడగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చే మార్గాలను కనుగొనాలని ఏసీఎంఏ సదస్సులో పిలుపునిచ్చారు. ‘విడిభాగాల తయారీ పరిశ్రమ దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం, వ్యాపార విస్తరణ, వృద్ధికి ఇప్పటికే ఉన్న మానవశక్తి నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి కొత్త సాంకేతికతలు, ఇంధనాలను స్వీకరించడానికి దారితీస్తున్నాయి. తద్వారా ముఖ్యంగా భారతీయ ఆటో విడిభాగాల తయారీదార్లకు పెద్ద అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు ’మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రతిరూపాలలో మీరు ఒకరు. ఇప్పుడు తయారీ నైపుణ్యాన్ని సంపాదించిన తర్వా త మనం ’డిజైన్ ఇన్ ఇండియా’ వైపు మళ్లాలి. భారత్‌లో భారీ టాలెంట్ పూల్ ఉంది. కానీ వారిని పరిశ్రమకు సిద్ధం చేయడానికి ముడిపడి ఉన్న అన్ని సంస్థలతో అనుసంధానం అవసరం. ప్రభుత్వం నుండి కూడా క్రియాశీల మద్దతు కోరుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
2022లో.. 37.93 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు
ముంబై: దేశీయంగా 2022లో మొత్తం 37.93 లక్షల ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. 2021తో పోల్చితే 23% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఇండియా కార్లు రికార్డు సేల్స్ నమోదు చేసుకున్నాయి. కరోనా ప్రేరేపిత సవాళ్లు, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ముఖ్యంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)లకు గిరాకీ పెరిగింది. -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు
ముంబై: ప్యాసింజర్ వాహనాలు ఈ నెలలో జోరుగా విక్రయాలను నమోదు చేస్తాయని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. క్రితం ఏడాది నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధిక నమ్మకాలు నమోదవుతాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ బలంగా ఉండడం, పెరిగిన తయారీని ప్రస్తావించింది. వాణిజ్య వాహనాలు రెండంకెల వృద్ధిని చూపిస్తాయని పేర్కొంది. డీలర్ల స్థాయిలో నిల్వలు ఉన్నందున ట్రాక్టర్ల విక్రయాలు వృద్ధిని చూపించకపోవచ్చని అంచనా వేసింది. అక్టోబర్‌తో పోలిస్తే (పండుగల సీజన్) నంబర్లో వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్లు తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎంకే గ్లోబల్ వివరించింది. ఈ నెల గణాంకాలను వాహన తయారీ సంస్థలు డిసెంబర్ 1న ప్రకటించనుండడం గమనార్హం. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ టాప్ ప్యాసింజర్ వాహనాల ఆర్డర్లు బలంగా ఉన్నాయని, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహన అమ్మకాల పరంగా సానుకూల గణాంకాలు నమోదవుతాయని ఎంకే గ్లోబల్ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ విక్రయాల పరంగా 64 శాతం వరకు వృద్ధిని చూపించొచ్చని, టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 51 శాతం పెరగొచ్చని పేర్కొంది. మారుతి సుజుకీ 18 శాతం అధిక అమ్మకాలు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్యాసింజర్, కార్గో విభాగాల నుంచి డిమాండ్ బలంగా ఉండడంతో వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేసింది. అశోక్ లేలాండ్ సంస్థ వాణిజ్య వాహన అమ్మకాలు 41 శాతం పెరగొచ్చని.. ఐచర్ మోటార్-వోల్వో ఐచర్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 36 శాతం మేర వృద్ధి ఉంటుందని పేర్కొంది. ద్విచక్ర వాహన అమ్మకాలు 10 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. -
ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉబర్ క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రైవర్ ఫోన్ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్ లొకేషన్ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. -
వాహన కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కఠినతరమైన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కార్లు, వాణిజ్య వాహనాల రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి స్థాయి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తీర్చిదిద్దాలంటే కంపెనీలు మరింత అధునాతనమైన విడిభాగాలు, పరికరాలను వాహనాల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని అంతిమంగా కొనుగోలుదారులకే బదలాయిస్తాయి. కొత్త ప్రమాణాల ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్గారాల స్థాయులను పర్యవేక్షించేందుకు వాహనాల్లో సెల్ఫ్–డయాగ్నోస్టిక్ డివైజ్‌ను అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ కాలుష్యకారక వాయువులు నిర్దేశిత ప్రమాణాలను దాటిపోతే వాహనాన్ని సర్వీస్‌కు ఇవ్వాలంటూ వార్నింగ్ లైట్ల ద్వారా ఈ పరికరం తెలియజేస్తుంది. అలాగే, ఇంజిన్లోకి ఎంత ఇంధనం, ఎప్పుడు విడుదల అవ్వాలనేది నియంత్రించేందుకు ప్రోగ్రాం చేసిన ఫ్యుయల్ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి. ఇంజిన్ ఉష్ణోగ్రత, గాలి పీడనం మొదలైన వాటిని పర్యవేక్షించేలా సెమీకండక్టర్లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. డిమాండ్‌పై ప్రభావం.. కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా వాహనాలను రూపొందించాలంటే ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. సెల్ఫ్ డయాగ్నాస్టిక్ డివైజ్‌లు, హార్డ్‌వేర్.. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ మొదలైన వాటిపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. గత 15–18 నెలలుగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా వాహన కంపెనీలు రేట్లను పెంచుతూనే ఉన్నాయని .. మరింతగా పెంచితే డిమాండ్‌పై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని గుప్తా తెలిపారు. కాలుష్య కట్టడిలో భాగంగా 2020 ఏప్రిల్ 1 నుంచి వాహనాల కంపెనీలు బీఎస్4 ప్రమాణాల నుంచి నేరుగా బీఎస్6 ప్రమాణాలకు మారాల్సి వచ్చింది. వీటికి అనుగుణంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. నవరాత్రికి వాహనాల జోరు నవరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిటైల్‌లో 5,39,227 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశ చరిత్రలో నవరాత్రికి జరిగిన విక్రయాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 57 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 మధ్య ఈ విక్రయాలు జరిగాయి. 2019 నవరాత్రి సందర్భంగా భారత్‌లో 4,66,128 యూనిట్లు రోడ్డెక్కాయి. మూడేళ్ల తరువాత వినియోగదార్లతో షోరూములు కిటకిటలాడాయి. ద్విచక్ర వాహనాలు 52.35 శాతం దూసుకెళ్లి 3,69,020 యూనిట్లు నమోదయ్యాయి. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 3.7 శాతం వృద్ది సాధించడం విశేషం. ప్యాసింజర్ వాహనాలు 70.43 శాతం ఎగసి 1,10,521 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 48.25 శాతం పెరిగి 22,437 యూనిట్లు నమోదైంది. త్రిచక్ర వాహనాలు రెండు రెట్లకుపైగా వృద్ధి చెంది 19,809 యూనిట్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57.66 శాతం అధికమై 17,440 యూనిట్లకు చేరుకున్నాయి. -
కార్లు.. కుయ్యో.. మొర్రో, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు!
ముంబై: ఆటో పరిశ్రమ సప్లై సమస్యలతో సతమతమవుతోంది. దీనితో ఉత్పత్తి తగ్గి, కార్ల తయారీ కంపెనీల ఏప్రిల్ అమ్మకాలు క్షీణించాయి. ముఖ్యం గా దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకి, హ్యూందాయ్ కార్ల హోల్‌సేల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అయితే టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, స్కోడా ఆటో కంపెనీలు గత నెల మెరుగైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకి గతేడాది ఏప్రిల్ కంటే ఈసారి ఏడు శాతం తక్కువగా 1,32,248 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హ్యూందాయ్ సైతం సమీక్షించిన నెలలో పది శాతం క్షీణతతో 44,001 యూనిట్లను విక్రయించింది. హోండా కార్స్ కంపెనీ అమ్మకాలు ఏప్రిల్ 7,874 యూనిట్లతో 13 % పడిపోయా యి. ‘‘వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా సమస్య తీవ్రంగా ఉందని, అందుకే అమ్మకాలు నెమ్మదించాయి’’ అని హోండా మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ యుచి మురాటా అన్నారు. చదవండి👉 ట్విటర్ ఎఫెక్ట్: టెస్లాకు భారీ షాక్! -
ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా
ఆటోమొబైల్ సెక్టార్లో ధరల పెంపు సీజన్ నడుస్తోంది. వరుసగా ఒక్కో కంపెనీ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ కూడా ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ తాజా పెంపు కూడా తక్షణమే (2022 ఏప్రిల్ 23) అమల్లోకి వస్తుందని తెలిపింది. కార్ల తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా వెల్లడించింది. టాటాలో అనేక మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. వివిధ మోడళ్లు, వేరియంట్లు అన్నింటి మీద సగటున 1.1 శాతం ధర పెరిగింది. టాటా నుంచి నెక్సాన్, హారియర్, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మోడళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇవి కావాలనుకునే వారు ఇకపై పెరిగిన ధర చెల్లించకతప్పదు. కాగా కమర్షియల్ వెహికల్స్‌కి ధరల పెంపు నుంచి టాటా మినహాయింపు ఇచ్చింది. చదవండి: Maruti Car Prices Hike: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
న్యూఇయర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలే, పడిపోయిన ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
కొత్త సంవత్సరం ఆటోమొబైల్ సంస్థలకు ఏమాత్రం కలిసిరాలేదంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. న్యూఇయర్ సెంటి మెంట్ కారణంగా ఆయా ప్రొడక్ట్ ల సేల్స్ భారీ ఎత్తున జరుగుతాయి. కానీ ఆటోమొబైల్ రంగంలో అందుకు భిన్నంగా సేల్స్ జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయి. గతేడాదికంటే ఈఏడాది ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు పడిపోవడం అందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది.ముఖ్యంగా సెమీ కండక్టర్ల కొరతతో పాటు కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరందుకోవడం వంటి అంశాలు కొనుగోలు దారులపై పడినట్లు ఎఫ్ఏడీఏ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10.12 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిటైల్ విక్రయాలు 2,87,424 నుంచి 2,58,329 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత ఇందుకు కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహన విక్రయాలు 13.44 శాతం తగ్గి 10,17,785 యూనిట్లుగా ఉంది. -
అటు అమ్మకాల్లో దుమ్ము లేపుతుంటే..ఇటు ఈసురో మంటున్నాయి
అసలే ఇప్పుడు కరోనా కాలం..ఏ రంగం చూసినా ఈసురో మంటోంది. కానీ ఆటోమొబైల్ రంగం మాత్రం జోరును కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ (టూ వీలర్స్) అమ్మకాలు 1,00,736 యూనిట్లు ఉండగా.. 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో దేశీయ ప్యాసింజర్ వాహన రిటైల్ విక్రయాలు గతేడాది డిసెంబర్లో నెమ్మదించాయి. ఆటో పరిశ్రమపై సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగడం ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది(2021) డిసెంబర్లో 2,44,639 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయినట్లు ఫాడా తెలిపింది. అంతకుముందు (2020) ఇదే డిసెంబర్లో అమ్ముడైన 2,74,605 యూనిట్లతో పోలిస్తే ఇవి 11 శాతమని తక్కువ. మొత్తంగా వాహనాల రిటైల్ విక్రయాలు గత నెల 16.05 శాతం తగ్గి 15,58,756 యూనిట్లుగా నమోదయ్యాయి.దేశంలో 1,590 వాహన రిజిస్ట్రేషన్ కేంద్రాలుండగా, 1,379 కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను ఫాడా విడుదల చేసింది. ‘‘ఆటో కంపెనీలు ఏడాది నిల్వలను తగ్గించుకునేందుకు డిసెంబర్లో వాహనాలపై భారీ రాయితీలను ప్రకటిస్తుంటాయి. కావున ప్రతి ఏటా డిసెంబర్లో విక్రయాలు భారీగా ఉంటాయి. అయితే ఈసారి అమ్మకాలు నిరాశపరిచాయి’’ అని ఫాడా చైర్మన్ వింకేశ్ గులాటి తెలిపారు. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతోఆటో కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తిని సాధించడంలో విఫలయ్యాయని పేర్కొన్నారు. అయితే, గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొన్నారు. దీంతో డీలర్లకు సరఫరా పెరిగిందన్నారు. ద్విచక్ర వాహన విక్రయాలు అంతంతే... సమీక్షించిన నెలలో ద్వి చక్ర వాహన విక్రయాలు 20 మేర క్షీణించాయి. డిసెంబరు 2020లో 14,33,334 యూనిట్లు విక్రయించగా.. ఈసారి అవి 11,48,732 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాహనాల ధరలు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, వర్క్ ఫ్రమ్ హోం పొడిగింపు, తాజాగా ఒమిక్రాన్ భయాలు వంటి కారణాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. వాణిజ్య వాహన అమ్మకాలు జూమ్ వాణిజ్య వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. గతేడాది(2021) డిసెంబర్లో 58,847 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది డిసెంబర్లో అమ్ముడైన 51,749 యూనిట్లతో పోలిస్తే ఇవి 14శాతం అధికం. కేంద్రం మౌలిక వసతి కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, సరుకు రవాణా ఛార్జీలు పెరగడం, కొత్త ఏడాదిలో కంపెనీలు వాహన ధరల్ని పెంచడం, లో బేస్ తదితర కారణాలతో ఈ విభాగంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. -
వాహన విక్రయాలకు చిప్ సెగ
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్‌లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్‌లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్‌సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి. 7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు.. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,54,058 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 2,29,734 యూనిట్లతో పోలిస్తే ఇది 10.59 శాతం అధికం. లో బేస్ ప్రభావమే ఇందుకు కారణమని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ఈ వివరాలు తెలిపింది. దేశవ్యాప్తంగా 1,481 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు (ఆర్టీవో) ఉండగా.. 1,274 ఆర్టీవోల నుంచి సమీకరించిన గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడైనట్లు పేర్కొంది. ఎఫ్ఏడీఏ ప్రకారం.. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16% క్షీణించి 10,91,288 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు సుమారు 30% తగ్గి 59,020కి క్షీణించాయి. అటు త్రిచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయి 33,319 యూనిట్లకు తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం పెరిగి 61,351 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవారీగా చూస్తే వాహనాల విక్రయాలు 13 శాతం క్షీణించి 14,99,036 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్-4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మళ్లే క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు మందగించాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. సెమీ కండక్టర్ల కొరతతో కష్టాలు.. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడటం వల్ల ప్యాసింజర్ వాహనాల డెలివరీల్లో దాదాపు ఎనిమిది నెలల దాకా జాప్యం జరిగిందని గులాటీ వివరించారు. వాహనాలు అందుబాటులో లేక దాదాపు 50 శాతం మంది డీలర్లు సుమారు 20 శాతం పైగా విక్రయ అవకాశాలు కోల్పోయారని ఎఫ్ఏడీఏ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. తాజాగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుండటంతో కొన్ని రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. ఇంధన రేట్లు భారీగా పెరగడం కూడా దీనికి తోడైందని గులాటీ పేర్కొన్నారు. మరోవైపు, ఫైనాన్సింగ్ పరమైన సమస్యలతో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడుతోందని, విద్యా సంస్థలు ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల ప్యాసింజర్ బస్సుల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆటో ఎల్పీజీ.. 40% చౌకైన ఇంధనం ఐఏసీ వెల్లడి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఇతర ఇంధనాల వైపు చూస్తున్న వినియోగదారులకు ఆటో ఎల్పీజీ చౌకైన ప్రత్యామ్నాయం కాగలదని ఇండియన్ ఆటో ఎల్పీజీ కూటమి (ఏఐఎసీ) పేర్కొంది. ఇది సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే 40 శాతం చౌకైనదని తెలిపింది. ఆటో ఎల్పీజీ/సీఎన్జీ కన్వర్షన్ కిట్లను మరింత తక్కువ రేటులో అందుబాటులోకి తెచ్చేందుకు వీటిపై విధిస్తున్న 28% జీఎస్టీని తగ్గించాలని కేంద్రాన్ని ఒక ప్రకటనలో కోరింది. సముచిత విధానాలతో ప్రోత్సహించిన పక్షంలో సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఆటో ఎల్పీజీ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని ఐఏసీ తెలిపింది. ‘ఇంధన వ్యయాపరంగా చూస్తే పెట్రోల్ కన్నా ఇది కనీసం 40% చౌకైనది’ అని పేర్కొంది. ధరపరంగా ఇంత భారీ వ్యత్యాసమున్న నేపథ్యంలో ఆటో ఎల్పీజీ కిట్లను ఏర్పాటు చేసుకునే వాహనదారులు.. వాటిపై పెట్టిన పెట్టుబడిని ఆరు నెలల్లోనే రాబట్టుకోవచ్చని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయష్ గుప్తా తెలిపారు. దీనితో కాలుష్యకారక వాయువుల విడుదల.. సీఎన్జీ, పెట్రోల్‌తో పోలిస్తే 50 శాతం, డీజిల్‌తో పోలిస్తే 80 శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. -
ఏందిరా సామి ఇది, ఆటోనేనా?!
సాక్షి, హైదరాబాద్: అమాయకుల అవసరాలే పెట్టుబడిగా ఆటో డ్రైవరన్నలు సాహసాలు చేస్తున్నారు. పరిమితికి మించి అనేకంటే అంతకు మించి ప్రయాణికులతో బండి లాగించేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతియేడు లక్షా 50 వేలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఓ వైపు గణాంకాలు హెచ్చరిస్తున్నా అటు ప్యాసెంజర్ వాహనాలు, ఇటు ప్రజల నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. పైన కనిపిస్తున్న ఫొటోనే ఇందుకు నిదర్శనం. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 మందితో వెళ్తున్న ఈ ఆటో ‘విన్యాసం’ బయటపడింది. మహబూబ్‌నగర్ పోలీసులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. ‘ఏందన్నా..! అది ఆటో నా ? మినీ బస్సా ? 7 సీటరా లేక 14 సీటరా ? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?’ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు డ్రైవర్ తీరుపై విస్మయం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆటో ఎక్కే ప్రయాణికులకు కూడా సోయి ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో ప్రభుత్వం సరిపడా రవాణా సదుపాయాలు కల్పిస్తే ప్రజలెందుకు ప్రాణాలకు తెగించి మరి ఇలా ఎందుకు వెళ్తారని అంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడపొచ్చుగా అని సూచనలు ఇస్తున్నారు. -
వీడని సంక్షోభం : క్షీణించిన విక్రయాలు
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభం నుంచి ఆటో కంపెనీలు ఇంకా బయట పడినట్టు లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. పరిశ్రమ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. జూన్ 2019 తో పోల్చితే జూన్ 2020 లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 57.98 క్షీణత నమోదైందని సియామ్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. జూన్ 2019 తో పోలిస్తే జూన్ 2020లో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 31.16 శాతం తగ్గాయని తెలిపింది. జూన్ 2019తో పోల్చితే జూన్ 2020లో వ్యాన్ల అమ్మకాలు 62.06 శాతం తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు కూడా 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్లను అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే నెలలో 5,12,626 యూనిట్లుగా ఉన్నాయి. సియామ్ తాజా గణాంకాల ప్రకారం జూన్ 2020 లో ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్ల అమ్మకాలు వరుసగా 38.56 శాతం, 80.15శాతం తగ్గాయి. జూన్ 2019 తో పోల్చితే ప్రయాణీకుల వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాల మొత్తం ఎగుమతులు వరుసగా 2020 జూన్‌లో 56.31 శాతం, 34.98 శాతం, 34.25 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. -
మళ్లీ మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి 20.85 శాతం తగ్గింది. -
ప్యాసింజర్ వాహన అమ్మకాలు 1.11% డౌన్
న్యూఢిల్లీ: గతనెల్లో దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 1.11 శాతం తగ్గుదలను నమోదుచేశాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 2,72,284 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 2,75,346 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గడిచిన ఎనిమిది నెలల్లో పీవీ అమ్మకాలు తగ్గుదలను నమోదుచేయడం ఇది 7వ సారి కావడం గమనార్హం. గతనెల్లో విక్రయాలు తగ్గడానికి.. ఎన్నికలకు ముందు అనిశ్చితి, మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడం, అధిక వడ్డీ రేట్లు, బీమా వంటి ప్రతికూలతలు కారణమని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే పీవీ అమ్మకాలు 3.27 శాతం పెరిగాయి. 30,85,640 యూనిట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో 29,87,859 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రస్తుత పూర్తి ఏడాదికి 3 శాతం వృద్ధి అంచనాను సియామ్ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 8–10 శాతం అంచనాను ఇచ్చింది. మరోవైపు ద్విచక్ర వాహన అమ్మకాలు గతనెల్లో 4.22 శాతం తగ్గాయి. 16,15,071 యూనిట్లుగా ఉన్నాయి. మారుతీ ఆధిపత్యం.. పీవీ వాహన విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 0.19 శాతం వృద్ధితో ఫిబ్రవరిలో 1,39,912 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 3.13 శాతం క్షీణతతో 43,110 యూనిట్లను విక్రయించింది. -
టాటా మోటార్స్ కార్లు ధరల మోత
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2019 నుంచి వర్తిస్తుందని గురువారం తెలిపింది. ప్యాసింజర్ వాహనాల అన్ని మోడళ్లపై దాదాపు రూ .40 వేల వరకు పెంచినట్టు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వ్యాపార విభాగ అధ్యక్షుడు మయాంక్ పారిక్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్ నానో లాంటి ఎంట్రీ లెవల్ కారునుంచి ప్రీమియం ఎస్యూవీ హెక్సా దాకా పలు వాహనాలను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .2.36 లక్షలు, రూ. 17.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. కాగా జనవరి నెలలో సంస్థ తన కొత్త ప్రీమియం ఎస్యూవీ హారియర్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. -
ప్యాసింజర్ వాహనాల నెమ్మది!
ముంబై: ప్రయాణికుల వాహన విక్రయ అంచనాలను రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రీసెర్చ్ తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన(పీవీ) విక్రయాలు 9–11 శాతం రేంజ్లో వృద్ధి చెందుతాయని క్రిసిల్ గతంలో అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7–9 శాతానికి తగ్గించింది. డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, పండుగల సీజన్లో కూడా నిల్వలు అధికంగా ఉండటం దీనికి కారణాలని వివరించింది.పీవీ విక్రయాలకు సంబంధించి క్రిసిల్ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలివీ... ∙గత ఏడాది అక్టోబర్‌లో 2,79,877 ప్రయాణీకుల వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో వాహన విక్రయాలు 1.6 శాతం వృద్ధితో 2,84,224కు పెరిగాయి. వీటిల్లో కార్ల అమ్మకాల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, యుటిలిటీ వెహికల్స్ 4 శాతం వృద్ధి చెందాయి. ∙ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకూ తగ్గిన పీవీ విక్రయాలు ఈ అక్టోబర్‌లో పెరిగాయి. ∙సాధారణంగా దసరా, దీపావళి పండుగల అమ్మకాలు.. మొత్తం ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో ఐదవవంతుగా ఉంటాయి. అయితే ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల అమ్మకాలు ఈ స్థాయిలో లేవు. ∙ఈ ఏడాది అక్టోబర్ నెల మొదటి పది రోజుల్లో మంచి రోజులు లేవని ఉత్తర భారత దేశంలో కార్ల అమ్మకాలు పెద్దగా జరగలేదు. ∙ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి పీవీ అమ్మకాలు 6 శాతమే పెరిగాయి. ∙ డిమాండ్ బాగా ఉన్న మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ రెండు వారాలకు తగ్గిపోయింది. ∙కొత్త మోడళ్ల కంటే ప్రస్తుత మోడళ్లకు సంబంధించిన వేరియంట్లు అధికంగా ఉన్నాయి. ∙కార్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాణిజ్య వాహన విక్రయాలు మాత్రం దుమ్మురేపాయి. ఈ అక్టోబర్‌లో వాణిజ్య వాహన అమ్మకాలు 25 శాతం ఎగిశాయి. ఈ వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించడం ఇది వరుసగా 12వ నెల కావడం విశేషం. ∙మధ్య తరహా, భారీవాణిజ్య వాహన విక్రయాలు ఈ అక్టోబర్‌లో 18% పెరిగాయి. టిప్పర్ సెగ్మెంట్ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. నిర్మాణ రంగంలో కార్యకలాపాలు జోరు పెరగడం, పారిశ్రామిక కార్యకలాపాల పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలు. ∙ఇక టూ వీలర్ అమ్మకాలు 17 శాతం పెరిగాయి. పండుగల సీజన్లో డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ, బీమా ప్రీమియమ్ భారీగా పెరగడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. -
ఈ వాహనాలపై రూ.2.17లక్షల తగ్గింపు
ముంబై: జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం వాహన తయారీ సంస్థల డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ కోవలో తాజాగా టాటా మోటార్స్ జత చేరింది. జీఎస్టీ ప్రయోజనాలను తమ వినియోగదారులకు చేరవేయాలని భావిస్తున్నట్టు టాటామోటార్స్ ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ధరలపై రూ. 3,300-2.17 లక్షల మేర తగ్గించింది. వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది. పాసెంజర్ వెహికల్స్‌పై రూ.3వేలనుంచి 2.17 లక్షల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో మోడల్ , వేరియంట్ పై ఆధారపడి 12 శాతం వరకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నట్టు టాటా మోటర్స్ ప్రెసిడెంట్, (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పార్ఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 3,300 ల నుంచి రూ .2,17,000 వరకు ధర తగ్గింపు ఉండనుందని తెలిపారు. జిఎస్టీని ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నును అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం చర్యను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక కొత్త శకాన్నిసృష్టింసుందని పేర్కొన్నారు కాగా మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగ వాహనాలు, ఎస్‌యూవీల ధరలను సగటున 6.9 శాతం తగ్గించింది. అదేవిధంగా, కంపెనీ చిన్న వాణిజ్య వాహనాల ధరలను కూడా తగ్గించింది. జీఎస్టీ అనంతరం హోండా కార్స్ ఇండియా, ఫోర్డ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, ద్విచక్ర వాహనాల తయారీదారులైన టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీలు తగ్గింపుధరలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
పాసింజర్ వాహన అమ్మకాల్లో స్వల్ప వృద్ధే
ముంబై: దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగానే పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. చిన్న కార్లు, యుటిలిటీ వాహనాల సెగ్మెంట్లో డిమాండ్ బలహీనంగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 2-3 శాతం వృద్ధినే సాధిస్తాయని వివరించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 6-7 శాతం వరకూ క్షీణించవచ్చని అంచనాలున్నాయి. మొత్తం వాహన అమ్మకాల్లో చిన్న కార్ల అమ్మకాల వాటా 55-60 శాతం వరకూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 23 లక్షల ప్రయాణికుల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలం అమ్మకాలతో పోల్చితే 6 శాతం క్షీణత నమోదైంది. అయితే ఈ కేటగిరీ వాహన అమ్మకాలు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు అధిక స్థాయిల్లో ఉండడం, ఇంధనం ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల గత మూడేళ్లలో ప్రయాణికుల వాహనాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా రానున్న నెలల్లో డిమాండ్ స్వల్పంగా పుంజుకోవచ్చు. సుంకం తగ్గింపు జూన్ 30 వరకూ అమల్లో ఉంటుంది. కాబట్టి అమ్మకాలు కొంచెం పుంజుకోవచ్చు.