ఆటోమొబైల్ సెక్టార్‌లో ధరల పెంపు సీజన్ నడుస్తోంది. వరుసగా ఒక్కో కంపెనీ వాహనాల ధరలు పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ కూడా ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ తాజా పెంపు కూడా తక్షణమే (2022 ఏప్రిల్ 23) అమల్లోకి వస్తుందని తెలిపింది. కార్ల తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరిగినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా వెల్లడించింది.
టాటాలో అనేక మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉంది. వివిధ మోడళ్లు, వేరియంట్లు అన్నింటి మీద సగటున 1.1 శాతం ధర పెరిగింది. టాటా నుంచి నెక్సాన్, హారియర్, టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ మోడళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ఇవి కావాలనుకునే వారు ఇకపై పెరిగిన ధర చెల్లించకతప్పదు. కాగా కమర్షియల్ వెహికల్స్‌కి ధరల పెంపు నుంచి టాటా మినహాయింపు ఇచ్చింది.
చదవండి: Maruti Car Prices Hike: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..!
Comments
Please login to add a commentAdd a comment