
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి 20.85 శాతం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment