న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా... కరోనావైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్‌ల తయారీ చేపట్టనుంది. భారత ప్రభుత్వం కోరిక మేరకు వెంటిలేటర్స్, మాస్క్‌లు, పీపీఈలను తయారు చేసేందుకు అగ్వా హెల్త్‌కేర్ కంపెనీతో కలిసి పనిచేస్తామని మారుతీ సుజుకీ ప్రకటించింది. నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని లకి‡్ష్యస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. మారుతీ తయారు చేసే వెంటిలేటర్స్‌కు తగిన టెక్నాలజీని అగ్వాహెల్త్ కేర్ అందించనుంది. ఈ వెంటిలేటర్స్ తయారీకి కావాల్సిన నగదు, ప్రభుత్వపరమైన అనుమతులన్నింటిని మారుతీ సుజుకీ భరించి అగ్వా హెల్త్‌కేర్‌కు ఉచితంగా అందించనుంది. మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి హరియాణ, కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనుంది కూడా. ఇంకా భారత్ సీట్స్ లిమిటెడ్‌తో కలిసి వైరస్ నుంచి రక్షణ కల్పించే క్లాత్‌ను తయారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment