ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్ వ్యయాలు, డిస్కౌంట్ల అంశంపై ఆదాయపన్ను శాఖకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్‌ను కోల్పోయింది. వినియోదారులకు అందిస్తున్న డిస్కౌంట్లకు సంబంధించిన వ్యయాలను, డిస్కౌంట్లను పునర్నిర్వచించాలని ఐటీ శాఖ తెలిపింది. దీంతో భారీ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లతో వినియోగదారులకు వల విసురుతున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్ల వైనానికి ఇక తెరపడనుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్)లో దాఖలు చేసిన అప్పీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కోల్పోయింది. వినియోగదారులకు ఇస్తున్న డిస్కౌంట్లను కంపెనీ వ్యయాల్లోకి చేర్చాలని కోరుతూ, తద్వారా కంపెనీ ఆదాయనష్టాలను పూడ్చుకోవాలన్న సంస్థ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ తోసి పుచ్చింది. ఇటువంటి వ్యయాలు వ్యాపారాన్ని బ్రాండ్‌ను నిర్మించటానికి ఉద్దేశించినవని ఆదాయపు పన్ను విభాగం వాదన. అందువల్ల వీటిని మూలధన వ్యయంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఫలితంగా ఈకామర్స్‌సంస్థలపై 30శాతం పన్ను భారం పడనుంది. దీంతో ఇకామర్స్ కంపెనీల డిస్కౌంట్లకు తెరపడనుందని అంచనా. అలాగే భారీ డిస్కౌంట్లను అందిస్తున్న అమెజాన్, స్నాప్‌డీల్ లాంటి ఇతర ఆన్‌లైన్ రిటైలర్లకు ఇదొక పరీక్షగా మారవచ్చని తెలుస్తోంది.
అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆశ్రయించే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఆదాయపన్నుశాఖ ముందుకు వచ్చిన ఏకైక సంస్థ కాదు. ఈ సమస్య వెలుగులోకి రావడం ఇదే మొదటిసారీకాదు. ఈ విషయాల్లో నిపుణులచే రెండు వైపులా వాదనల తరువాత పరిష్కరించుకోవాల్సిన సమస్యలో ఇదొకటి చెబుతున్నారు. మరోవైపు సంబంధిత కంపెనీలు చట్టపరమైన ఉపశమనంకోసం ప్రయత్నిస్తే ఐటీ శాఖ చర్యలు వీగిపోతాయని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ నిర్ణయం డిసెంబరులో జరిగిందంటూ ఫ్లిప్‌కార్ట్ సీనియర్ అధికారి అభివృద్ధిని ధృవీకరించారని రిపోర్ట్ చేసింది. మరికొద్ది రోజుల్లో ఆదాయం పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) లో సవాల్ చేస్తారని చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment