దేశంలో ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 54% పెరుగుతుందని అంచనా. 2023-24లో రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్‌బీఐ ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.
పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ నిర్వహణ, స్థిరమైన క్రెడిట్ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి..వంటి చాలా అంశాలు ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయానికి, రోడ్లు, వంతెనలు, విద్యుత్..వంటి ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి వెచ్చిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ఇదీ చదవండి: ఆటోమేషన్‌తో మహిళలకు అవకాశాలు
బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారీగా నిధులు పొంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సదుపాయాల ద్వారా రానున్న 3-5 ఏళ్లల్లో ఆదాయం సమకూరనుంది. మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు దూసుకుపోతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. ఎగుమతులు హెచ్చవుతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి అధికమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment