యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా | defamation of rs. 5 crore filed on ap minister yanamala ramakrishnudu, brother | Sakshi
Sakshi News home page

యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా

Published Fri, Dec 26 2014 5:02 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా - Sakshi

యనమలపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా

ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడులపై పరువు నష్టం దావా దాఖలైంది. ప్రియాంక హేచరీస్ యజమాని చంద్రమౌళి వీరిపై రూ. 5 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. అనధికార హేచరీల నుంచి చంద్రమౌళి దబ్బులు వసూలు చేశారంటూ తనను విమర్శించడంతో ఆయన యనమల సోదరులిద్దరికీ లీగల్ నోటీసులు పంపారు.

అనుమతులు ఇప్పిస్తానంటూ చంద్రమౌళి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశారని యనమల సోదరులు గతంలో ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలు నిరాధారమని, తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 5 కోట్లు చెల్లించాలని కోరుతూ చంద్రమౌళి పరువునష్టం దావా దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement