
విశాఖ విమానాశ్రయం రికార్డు
గోపాలపట్నం(విశాఖపట్నం): విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా ప్రశంసలందుకునే స్ధితికి చేరింది. తాజాగా మిలియన్ ట్రేడ్ మార్క్‌ని అధిగమించి శభాష్ అనిపించుకుంది. ఈవిమానాశ్రయంలో ఎయిరిండియా, ఎయిర్‌ఆసియా, ఎయిర్‌కోస్తా, మలిందో, సిల్క్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు దేశీయ అంతర్జాతీయ విమానసర్వీసులు అందిస్తున్నాయి. హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, ముంబయ్, బెంగుళూరు, ఢిల్లీ వంటి విమానాశ్రయాలతో పాటు దుబాయ్, కౌలాలంపూర్, సింగపూర్, పోర్టుబ్లెయిర్‌లకూ విమాన సర్వీసులు ఊపందుకున్నాయి.
2012-13 సంవత్సరంలో తొలి సారి ప్రయాణికుల సంఖ్య మిలియన్‌మార్కుకు చేరుకుంది. ఆ ఏడాది ప్రయాణికుల సంఖ్య 10,38,958కు చేరి అప్పట్లో రికార్డు సృష్టించింది. తర్వాత 2013-14 సంవత్పరంలో దీన్ని అధిగమించి ముందుకెళ్తుందని అధికారులు ఆశించినా 10.14 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. రాష్ట్ర విభజన ఉద్యమాలు, సమ్మెలు, హుద్ హుద్ తుపాను ప్రభావం బాగా చూపింది. తర్వాత రాష్ట్రం రెండుగా చీలిన తరుణంలో 2014-15 లో ప్రయాణికుల రద్దీ ఎలా వుంటుందోనని అధికారులు ఆలోచనలోపడ్డారు. అయితే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడంతో అధికారులు ఊహించనంతగా రద్దీ పెరిగింది. తాజాగా ఈసంఖ్య 11 లక్షల ప్రయాణికులను అధిగమించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
అంతర్జాతీయ గుర్తింపునకుఅవకాశాలు: వినోద్‌కుమార్‌శర్మ
విశాఖ విమానాశ్రయం డెరైక్టర్ విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు రావడానికి అవకాశాలున్నాయని విమానాశ్రయ డెరైక్టర్ వినోద్ కుమార్ శర్మ అన్నారు.