త్వరలో విశాఖ హార్బర్ లో కార్యకలాపాలు | visakha harbour starts very soon | Sakshi
Sakshi News home page

త్వరలో విశాఖ హార్బర్ లో కార్యకలాపాలు

Published Thu, Oct 16 2014 5:10 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

visakha harbour starts very soon

న్యూఢిల్లీ: తుఫాను దెబ్బకు దారుణంగా దెబ్బతిన్న విశాఖ హార్బర్ లో కార్యకలాపాలను త్వరలో పునరుద్ధరిస్తామని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సృష్టం చేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా పౌరవిమానాల రాకపోకలకు సంబంధించి రక్షణశాఖ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం పౌరవిమానాయాన శాఖ అధికారులతో రక్షణశాఖ అధికారులు సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. అదృష్టవశాత్తు రన్వే బాగుండటం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా మరీ ఎక్కువగా దెబ్బ తినకపోవడంతో విమానాలను తిప్పడానికి సమస్య లేదని అధికారులు చెప్పారు.  హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన గాలులు విశాఖపట్నంతో పాటు విమానాశ్రయాన్ని తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్యాసింజర్ టెర్మినల్ మీద ఓ టార్పాలిన్ షీటును పైకప్పుగా వేసి ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement