సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను దాడికి తెగబడ్డాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి తీవ్రగాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ క్యాంటీన్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. శ్రీనివాస్ అనే వెయిటర్.. సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరారు.
(వైఎస్ జగన్‌పై దాడి ఫొటోలు)
సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు..
హోటల్ వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. వైఎస్ జగన్ సరేననడంతో.. ‘మీరు కాబోయే ముఖ్యమంత్రి’ అంటూ నవ్వూతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. ఊహించని ఘటన ఎదరుకావడంతో వైఎస్ జగన్ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. దీంతో కత్తివేటు వైఎస్ జగన్ భుజంపై పడింది. కోడి పందాల్లో ఉపయోంచే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మాటికే జగన్‌పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైఎస్ జగన్ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే ఏం జరిగేదో.
-మజ్జి శ్రీనివాసరావు, ప్రత్యక్ష సాక్షి.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : లైవ్ కవరేజ్ కోసం క్లిక్‌చేయండి
Comments
Please login to add a commentAdd a comment