అనుక్షణం సీఐఎస్‌ఎఫ్ బలగాల పహారా ఉండే విశాఖ ఎయిర్‌పోర్టు ఓ దారుణ దాడికి వేదికైంది. ప్రజా సంక్షేమమే వజ్ర సంకల్పంగా పాదయాత్ర సాగిస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో హత్యాయత్నం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.