సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడి నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు , మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బృందం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోనున్నారు. విశాఖలో దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న జగన్.. ప్రస్తుతం సిటీ న్యూరోలో చికిత్స తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ హెల్త్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఆయన స్టేట్‌మేంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తారు.
ఇక్కడ చదవండి :
Comments
Please login to add a commentAdd a comment