ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ | YS Jagan showed real determination and exempalary courage, tweets ramgopal varma | Sakshi
Sakshi News home page

ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ

Published Thu, Jan 26 2017 6:22 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ - Sakshi

ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ

సాధారణంగా ఎవరినైనా విమర్శించడానికి మాత్రమే తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి స్పందించారు. విశాఖపట్నంలో నిర్వహించదలచిన శాంతియుత ప్రదర్శన విషయంలో వైఎస్ జగన్ అసలైన నిబద్ధతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని చెప్పారు. గురువారం విశాఖలో తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఆయనకు 'హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేశారు.
 
కాగా,  రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. అసలు వచ్చినవాళ్లు పోలీసులా కాదా.. ఐడీ కార్డులేవని అడిగారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement