టీఆర్‌ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదాపడే అవకాశాలున్నట్టు తెలిసింది.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీ మళ్లీ వాయిదాపడే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్లీనరీని ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినా హుదూద్ తుపాను కారణంగా 18, 19 తేదీలకు వాయిదా వేశారు. కానీ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలు ఉండటం, దీపావళి వంటి కారణాలతో మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నట్టు పార్టీ ముఖ్యులు వెల్లడించారు.
దీపావళి తర్వాత జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే మధ్యలో 2 రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించాలనే యోచనలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఉన్నట్టు ఆ నాయకులు తెలిపారు.