టీడీపీ కార్యకర్తలు, నకిలీ బాధితులకు హుద్హుద్ తుపాను నష్టపరిహారాన్ని దోచి పెడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.తుపాను సాయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ తుపానులోనష్టపోయిన అసలైన బాధితులకు పరిహారం అందట్లేదని ఆయన చెప్పారు.
అలాంటి బాధితుల జాబితా కూడా ప్రభుత్వం రూపొందించలేదని ఆరోపించారు. మొత్తం 774 కోట్ల రూపాయలు విడుదలైతే, అందులో సగానికి పైగా సొమ్మును టీడీపీ కార్యకర్తలే దోచుకున్నారని మండిపడ్డారు. వీటిపై క్షేత్రస్థాయిలో అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, అధికారులతో సమీక్షలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ కార్యకర్తలకే తుపాను సాయం: రఘువీరా
Published Sat, Dec 13 2014 2:14 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement
Advertisement