relief funds
-
వరద బాధితులకు ప్రముఖ ఎన్నారై డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి భారీ విరాళం
-
జెలెన్స్కీ సంతకంతో కూడిన బేస్‌బాల్ వేలం
Baseball Up For Auction Proceeds To Support Relief Efforts In Ukraine: జెలెన్స్కీ సంతకం చేసిన మేజర్ లీగ్ బేస్‌బాల్(ఎంఎల్‌బీ) ఉక్రెయిన్ సహాయర్థం వేలాని సిద్ధమవుతోంది. 2019లో బిగ్ యాపిల్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై సంతకం చేశారు. ఈ ఎంఎల్‌బీ బేస్‌బాల్ పై ఉక్రెయిన్ భాషలోనూ, ఇంగ్లీష్ భాషలోనూ జెలన్స్కీ సంతకం ఉంటుంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ రాయబారిగా వ్లాదిమిర్ యెల్చెంకో ఉన్నసమయంలో ఆయన సంతకంతో కూడిన లేఖతో ఈ బేస్‌బాల్ అమెరికాకి వచ్చింది. ప్రస్తుతం ఈ బేస్‌బాల్ ఆర్ఆర్ వేలం ద్వారా అమ్మాకానికి వెళ్తోంది. వేలంలో ఇది సుమారు రూ.11 లక్షలు వరకు పలుకుతుందని నిపుణుల అంచనా. న్యూయార్క్‌లో ప్రభుత్వ వ్యవహారాల నిపుణుడిగా ఉన్న రాండీ ఎల్ కప్లాన్ ఈ బేస్ బాల్‌ను విక్రయిస్తున్నట్లు ఆర్ఆర్ వేలం హౌస్ తెలిపింది. అతను ఈ బేస్‌బాల్‌ని ఉక్రెయిన్ రాయబారి యెల్చెంకో నుండి బహుమతిగా అందుకున్నాడు. అంతేకాదు రాండీ ఎల్ కప్లాన్ సంపాదనలో కొంత భాగాన్ని ఉక్రెనియన్ సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నారు కూడా. ఆర్ఆర్ వేలం కూడా అదే ఫండ్‌కు ఈ బేస్‌బాల్ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తామని పేర్కొంది. మే 11న ఈ వేలం ముగియనుంది. ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడికి దిగాయి. గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులతో ఉక్రెయిన్‌ని శిథిలానగరంగా మార్చింది. వేలాది మంది నిరాశ్రయులవ్వగా, లక్షలాదిమంది వలస వెళ్లిపోయారు. ఇంకా చాలామంది ఉక్రెనియన్ పౌరులు భూగర్భ రైల్వేస్టేషన్లలోనే తలదాల్చుకుంటున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎదురుదాడి) -
ఆ ప్రాణం కోసం లక్షల్లో ఖర్చుపెట్టారు!
వేములవాడ: తండ్రి మేకలకాపరి, తల్లి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబలోని పెద్దకుమారుడు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రులల్లో చికిత్సకోసం రూ.7 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించారు. కుమారుడి వైద్యంకోసం అప్పులు చేశామని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన చెన్నవేని బక్కన్న రాజమల్లు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరిలో పెద్దకుమారుడు బాలకృష్ణ(21) రెండేళ్లక్రితం వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో మంచం పట్టాడు. అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు. అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాలేదు. చికిత్సపొందుతూ జనవరి 10న బాలకృష్ణ మృతిచెందాడు. ఆసుపత్రుల్లో చికిత్సకోసం చేసిన అప్పు అలాగే ఉంది. సీఎం రిలీఫ్‌ఫండ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదని వారు వాపోయారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బక్కన్న–రాజమల్లుదంపతులు వేడుకుంటున్నారు. -
కేరళపై ఇంత వివక్షా?
ప్రకృతి విలయతాండవంతో మొత్తం 14 జిల్లాలు నీటిలో మునిగి కేరళ రాష్ట్రం నేడు ఒక దీవిగా మారింది. ఆవాసాలు నీటిలో మునిగి తిండి, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో, తమ తమ శక్తిమేరకు సాయం చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఉండే భారతీయులు సైతం సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కాగా ప్రధాని మోదీ వైఖరి మాత్రం తీవ్ర వివాదాస్పదమౌతుంది. కేరళ రాష్ట్రానికి తక్షణ సహాయక చర్యల కోసం రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ప్రకటించడం బాధాకరం. ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులు చూసి కూడా మోదీ ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోవని, ఇలాంటి పరిస్థితుల్లో వివక్ష చూపరాదని హితవు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశ ప్రజల సొమ్ముకు కాపలా దారుగా ఉండాల్సిన ప్రధాని మోదీ దుబారా ఖర్చులకు, వ్యక్తిగత అభీష్టానికి, బీజేపీ, సంఘ్ పరివార్ ఉనికిని కాపాడుకోవటానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 2019లో జరుగబోయే అర్ధ కుంభమేళా ఏర్పాట్లకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2015 ఆగస్టులో బిహార్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సాయం కింద ఎంత కావాలంటూ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేలంపాట పాడి మరీ ప్రకటించారు. 2014–16 మధ్య వరుసగా రెండేళ్లు అనావృష్టి పాలైన తెలం గాణ రాష్ట్రంలో ఇన్–పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల సాయం అడుగగా, రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చి మోదీ చేతులు దులుపుకొన్నారు. 2014 అక్టోబర్‌లో హదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్టానికి రూ. 1,000 కోట్లు ప్రకటించారు కానీ, రూ.400 కోట్లకు మించి విడుదల చేయలేదు. 2015 డిసెంబరులో చెన్నై సిటీ జలదిగ్బంధం అయినప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ. 5 వేలకోట్లు తక్షణ సాయం కోరగా, ఒక వెయ్యి కోట్లు ప్రకటిం చారు. ఇప్పటికైనా సర్వస్వం కోల్పోయిన కేరళ రాష్ట్రంపై వివక్ష చూపకుండా, నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలను మోదీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆకాంక్షిద్దాం. కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు ‘ 98667 76999 -
కేరళకు లారెన్స్ భారీ విరాళం..!
సాక్షి, చెన్నై : ప్రకృతి విలయానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ వరద బాధితులకు విరాళం అందించేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులెందరో ముందుకొచ్చారు. తమ వంతు సాయం ప్రకటించారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ ఈ జాబితాలో చేరారు. వరద బాధితుల సహాయార్ధం ఆయన కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కేరళ సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించారు. -
టీడీపీ కార్యకర్తలకే తుపాను సాయం: రఘువీరా
టీడీపీ కార్యకర్తలు, నకిలీ బాధితులకు హుద్‌హుద్ తుపాను నష్టపరిహారాన్ని దోచి పెడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.తుపాను సాయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ తుపానులోనష్టపోయిన అసలైన బాధితులకు పరిహారం అందట్లేదని ఆయన చెప్పారు. అలాంటి బాధితుల జాబితా కూడా ప్రభుత్వం రూపొందించలేదని ఆరోపించారు. మొత్తం 774 కోట్ల రూపాయలు విడుదలైతే, అందులో సగానికి పైగా సొమ్మును టీడీపీ కార్యకర్తలే దోచుకున్నారని మండిపడ్డారు. వీటిపై క్షేత్రస్థాయిలో అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, అధికారులతో సమీక్షలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.