వేములవాడ: తండ్రి మేకలకాపరి, తల్లి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబలోని పెద్దకుమారుడు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రులల్లో చికిత్సకోసం రూ.7 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించారు. కుమారుడి వైద్యంకోసం అప్పులు చేశామని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన చెన్నవేని బక్కన్న రాజమల్లు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరిలో పెద్దకుమారుడు బాలకృష్ణ(21) రెండేళ్లక్రితం వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో మంచం పట్టాడు.
అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు. అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాలేదు. చికిత్సపొందుతూ జనవరి 10న బాలకృష్ణ మృతిచెందాడు. ఆసుపత్రుల్లో చికిత్సకోసం చేసిన అప్పు అలాగే ఉంది. సీఎం రిలీఫ్‌ఫండ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదని వారు వాపోయారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బక్కన్న–రాజమల్లుదంపతులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment