vemulwada
-
Vemulawada: ఏడాదిన్నర తర్వాత గర్భగుడిలోకి అనుమతి
సాక్షి, వేములవాడ(కరీంనగర్): వేములవాడ రాజన్నకు అభిషేకాలు చేసే అవకాశాన్ని ఆలయ అధికారులకు భక్తులకు ఏడాదిన్నర తర్వాత కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఏడాదిన్నర క్రితం గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాలను నిషేధించారు. అప్పటి నుంచి అభిషేక పూజలకు భక్తులకు అవకాశం కల్పించలేదు. దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈనెల 21 నుంచి రాజన్నకు అభిషేకాలు చేసేందుకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావంతో... 2020 మార్చిలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో రాజన్న గుడిని మూసివేశారు. తర్వాత తెరిచినప్పటికీ భక్తులకు సాధారణ దర్శన అవకాశమే కల్పించారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయానికి వచ్చిన ఆలయ అధికారులు రాజన్నకు అభిషేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆది, సోమవారాలు, ప్రత్యేక రోజుల్లో గర్భగుడి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. గర్భగుడిలో అభిషేకాల టికెట్లు రూ.600 తీసుకుంటున్నట్లు చెప్పారు. అభిషేకాల ధరలు పెంచే అంశం ఇంకా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం, ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైరస్ పూర్తిగా నశించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్న బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అభిషేకాలతో ఆలయంలో ఇబ్బందులు తప్పవని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా కాటుకు బలైన ఘటనలను గుర్తుకు చేసుకుంటున్నారు. ధర్మగుండం బంద్ మార్చి 16, 2020న మూతబడిన రాజన్న ధర్మగుండం ఇంకా తెరుచుకునేందుకు సమయం పట్టనుంది. ఈ నెల 21 నుంచి గర్భగుడిలోకి ప్రవేశాలు కల్పిస్తున్న అధికారులు ధర్మగుండంలో స్నానాలను మాత్రం నిషేధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తాం భక్తుల విజ్ఞప్తి మేరకు రాజన్న గర్భగుడిలో అభిషేకాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 21 నుంచి అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఉన్న నిబంధనల మేరకు అభిషేకాలు కొనసాగించనున్నాం. ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తాం. భక్తులు సహకరించి నిబంధనలు పాటిస్తూ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించుకోవాలి. – కృష్ణప్రసాద్, ఆలయ ఈవో చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
‘రాజన్నకే శఠగోపం పెట్టిన సీఎం కేసీఆర్’
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆరేళ్లక్రితం వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ గుడిమెట్ల సాక్షిగా యేటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పటికీ నెరవేర్చలేదని, రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధుల కొరతతో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే 15నెలలుగా పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నాయకులు సాగారం వెంకటస్వామి, సగ్గు పద్మ, ముడిగె చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు. చదవండి: Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి -
వామ్మో.. మాయలేడి ఎంతపనిచేసింది!
కథలాపూర్(వేములవాడ): ఒక మహిళ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన ఇప్పుడు వేములవాడలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్లకు చెందిన సదరు బాలిక కథలాపూర్‌లోని హస్టల్లో ఉంటూ చదువుకొంటుంది. ఈ క్రమంలో అంజుమ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పింది. ఇంతటితో ఆగకుండా ఒక రోజు బాలిక ఉంటున్న హస్టల్ వద్దకు చేరుకొంది. ఆ తర్వాత వెంటనే బాలికను కిడ్నాప్ చేసింది. అయితే బాలిక కనపడక పోవడంతో ఆందోళన చెందిన సదరు హస్టల్ నిర్వాహకులు బాలిక కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో బాలిక బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించి మాయలేడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. చదవండి: లేడి దొంగ..బట్టలు జారిపోతున్నా పట్టించుకోలేదు! -
ఆ ప్రాణం కోసం లక్షల్లో ఖర్చుపెట్టారు!
వేములవాడ: తండ్రి మేకలకాపరి, తల్లి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబలోని పెద్దకుమారుడు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రులల్లో చికిత్సకోసం రూ.7 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించారు. కుమారుడి వైద్యంకోసం అప్పులు చేశామని ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన చెన్నవేని బక్కన్న రాజమల్లు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరిలో పెద్దకుమారుడు బాలకృష్ణ(21) రెండేళ్లక్రితం వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో మంచం పట్టాడు. అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు. అనంతరం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాలేదు. చికిత్సపొందుతూ జనవరి 10న బాలకృష్ణ మృతిచెందాడు. ఆసుపత్రుల్లో చికిత్సకోసం చేసిన అప్పు అలాగే ఉంది. సీఎం రిలీఫ్‌ఫండ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదని వారు వాపోయారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బక్కన్న–రాజమల్లుదంపతులు వేడుకుంటున్నారు. -
కాంట్రాక్టర్ చేతికి కోడెల టికెట్లు
కౌంటర్‌కు తాళం వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలోని కోడె టికెట్లను ప్రైవేట్ వ్యక్తులు విక్రయిస్తున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు కోడి మెుక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం క్యూలైన్లో నుంచి టికెట్లు తీసుకునేందుకు వెళ్లిన భక్తులకు కౌంటర్‌కు తాళం వేసి కనిపించింది. పక్కనే కోడెలకు గట్టి కట్ట, అరటిపండు విక్రయించే కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి వద్ద కోడెల టికెట్లు కనిపించాయి. కౌంటర్ అతను లేడని, కోడెల టికెట్లు తీసుకోండని సదరు వ్యక్తి టికెట్లు ఇచ్చాడు. టికెట్‌తోపాటు గడ్డి, అరటికాయ కూడా కొనాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో అక్కడికి చేరుకుని యామ తిరుపతి అనే భక్తుడు.. గడి ఎందుకు కొనాలి, కోడె టికెట్ ఇవ్వాలన్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై కౌంటర్ వద్ద విధులు నిర్వహించే ఉద్యోగిని వివరణ కోరగా, తనకు అత్యవసరం ఏర్పడడంతో కౌంటర్‌కు తాళం వేసి వెళ్లానని, భక్తులు ఎవరైనా వస్తే కోడెల టికెట్లు ఇవ్వాలని చెప్పినట్లు వివరించాడు. -
కేసీఆర్ కృషి అభినందనీయం
మాజీ ఎంపీ, సినీనటుడు మోహన్‌బాబు వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ ఎంపీ, సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కృషి చేశారన్నారు. ఆ తర్వాత ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రశంసించారు. పదమూడేళ్ల తర్వాత మరోసారి రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత తమ కుటుంబం క్షేమంగా ఉందని తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని రాజన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. తన మిత్రుడు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను ఈ జిల్లాకు ప్రచారం చేసేందుకు వచ్చానని ఆయన గుర్తు చేశారు. సాగర్జీతో ఉన్న స్నేహబంధం తనను మరోసారి ఇక్కడికి వచ్చేలా చేసిందన్నారు. ఆయన వెంట కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఉన్నారు. అంతకుముందు ఆలయ ఈవో దూస రాజేశ్వర్, అర్చకులు మోహన్‌బాబుకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం బహూకరించారు.