కథలాపూర్(వేములవాడ): ఒక మహిళ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన ఇప్పుడు వేములవాడలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్లకు చెందిన సదరు బాలిక కథలాపూర్‌లోని హస్టల్‌లో ఉంటూ చదువుకొంటుంది. ఈ క్రమంలో అంజుమ్ అనే మహిళ ఆమెకు మాయమాటలు చెప్పింది. ఇంతటితో ఆగకుండా ఒక రోజు బాలిక ఉంటున్న హస్టల్ వద్దకు చేరుకొంది. ఆ తర్వాత వెంటనే బాలికను కిడ్నాప్ చేసింది. అయితే బాలిక కనపడక పోవడంతో ఆందోళన చెందిన సదరు హస్టల్ నిర్వాహకులు బాలిక కుటుంబానికి సమాచారం అందించారు.
దీంతో బాలిక బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించి మాయలేడిని అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment