![TPCC Working President Prabhakar Comments On CM KCR In Rajanna District - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/23/ve.jpg.webp?itok=vfzs-3L7)
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): ఆరేళ్లక్రితం వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ గుడిమెట్ల సాక్షిగా యేటా రూ.100 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పటికీ నెరవేర్చలేదని, రాజన్నకే శఠగోపం పెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధికి నిధుల కొరతతో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే 15నెలలుగా పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నాయకులు సాగారం వెంకటస్వామి, సగ్గు పద్మ, ముడిగె చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.
చదవండి: Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి
Comments
Please login to add a commentAdd a comment