విశాఖకు నాలుగు మిలటరీ దళాలు | four military units sent to vizag in wake of hudhud cyclone | Sakshi
Sakshi News home page

విశాఖకు నాలుగు మిలటరీ దళాలు

Published Thu, Oct 9 2014 10:51 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖకు నాలుగు మిలటరీ దళాలు - Sakshi

విశాఖకు నాలుగు మిలటరీ దళాలు

హుదూద్ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నానికి కేంద్రప్రభుత్వం నాలుగు మిలటరీ దళాలను పంపింది. విశాఖపట్నం - గోపాల్పూర్ ప్రాంతాలకు మధ్యలో తుఫాను తీరం దాటనున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో తీవ్ర విలయం సంభవించే ప్రమాదం ఉందన్న సూచనలతో ఈ చర్యలు తీసుకుంది.

మరోవైపు గోదావరి జిల్లాలపై కూడా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండేలా ఉంది. దాంతో తూర్పుగోదావరి జిల్లాలో తీరం వెంబడి ఉన్న 13 మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలలో కంట్రోల రూంలు ఏర్పాటుచేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి తిరిగి రావాలని తెలిపారు. కాకినాడ పోర్టులోనూ రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement