Control rooms
-
కాళేశ్వరంలో 2 కొత్త కంట్రోల్ రూమ్స్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లు ఇటీవల గోదావరి వరదల్లో నీటమునిగిన నేపథ్యంలో వీటికి శాశ్వ త పరిష్కారం చూపే అంశంపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టిసారించింది. భవిష్యత్తులో గోదావరికి భారీ వరదలొస్తే మళ్లీ ఈ పంప్‌హౌజ్‌లు నీటమునిగే చాన్స్ ఉండడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్‌ను ఎత్తైన ప్రాంతంలో కొత్తగా నిర్మించాలని నిర్ణయించింది. కనీసం 6 మీటర్లు ఎత్తు పెంచి... అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల లోపలే వీటికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ నిర్మించారు. పంప్‌హౌజ్‌ల సర్వీస్బే ఎత్తు తక్కువగా ఉండడంతో వరదల్లో పంప్‌హౌజ్‌లలోని మోటార్లతో పాటు కంట్రోల్ రూమ్స్ నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. అన్నారం పంప్‌హౌజ్‌ను 128 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 129.2 మీటర్ల వరకు వరద వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోల్‌రూమ్‌ను 134 మీటర్ల ఎత్తులో నిర్మించాలని భావిస్తున్నారు. మేడిగడ్డ పంప్‌హౌజ్‌ను 108 మీటర్ల ఎత్తులో నిర్మించగా, 108.2 మీటర్ల వరకు వరద వచ్చింది. దీంతో మేడిగడ్డ పంప్‌హౌజ్ కంట్రోల్‌రూమ్‌ను 112 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఇటీవలి గరిష్ట వరదమట్టంతో పోల్చితే కనీసం 6 మీటర్ల ఎత్తులో వీటి నిర్మాణం జరగనుంది. రెండు అంతస్తులతో కంట్రోల్ రూమ్స్‌ను నిర్మించనున్నట్టు అధికారవర్గా లు తెలిపాయి. భారీ పరిమాణం ఉండే కంట్రోల్ ప్యానెల్స్, స్టార్టర్ ప్యానెల్స్, ఆగ్జిలరీ బోర్డ్స్ వంటి అత్యంత ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. వరదల్లో నీట మునిగితే మళ్లీ పనికి రావు. వరదల్లో మునిగిన ప్రతిసారి రూ.వందల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఎత్తైన సురక్షిత ప్రాంతంలో కంట్రోల్ రూమ్స్ నిర్మిస్తేనే భవిష్యత్తులో వచ్చే వరదలతో నష్టాన్ని నివారించడం సాధ్యం కానుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జరుగుతున్న అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌ల పునరుద్ధరణ పను లు పూర్తైన తర్వాత కొత్త కంట్రోల్ రూమ్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వేసవిలో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. మోటార్లను ఆరబెట్టి వాడుకోవాల్సిందే భవిష్యత్తు వరదల నుంచి అన్నారం, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి నీటిపారుదల శాఖ వచ్చినట్టు తెలిసింది. పంప్‌హౌజ్‌లు నీట మునిగిన ప్రతిసారీ అందులోని మోటార్లను ఆరబెట్టి మళ్లీ కొంత కాలానికి వాడుకోవాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. పంప్‌హౌజ్‌లకు వరద రక్షణ గోడలు/కరకట్టలు నిర్మించడం అందులో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందికి సురక్షితం కాదన్న చర్చ జరుగుతోంది. -
మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఏర్పాట్లు చేసింది. స్టేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్‌ల వివరాలను ఎస్ఈబీ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్ వెల్లడించారు. అన్ని యూనిట్లలోనూ ఎస్ఈబీ ప్రత్యేకాధికారులుగా ఉన్న ఏఎస్పీలు కంట్రోల్ రూమ్‌లను పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపుతారు. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్: 94910 30853, 0866 2843131తో పాటు జిల్లాల్లోని ఫోన్ నంబర్ల వివరాలు.. -
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ - 08912590102.. విశాఖ ఆర్డీఓ కార్యాలయం- 8790310433.. పాడేరు - 08935250228, 8333817955, 9494670039.. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ - 8247899530, 7675977897. విశాఖ ఏజెన్సీలో మత్య గెడ్డ, రాళ్ళ గెడ్డ, కోడిమామిడి గెడ్డలో కాలువలు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తోన్నాయి. జి మాడుగుల మండలం కిల్లంగికోట పంచాయితీ గ్రామాల్లో నుంచి మండల కేంద్రలకు సంబందాలు తెగిపోయాయి. ముంచంగిపుట్టు మండలంబిరిగుడా బ్రిడ్జి పై వరద ఉధృతి కొనసాగుతుంది. బుంగపుట్టు ,లక్మిపురం గ్రామాల్లో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. మరి కాసేపట్లో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారి కన్నబాబు తెలిపారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరికాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 17,18 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 939 క్యూసెక్కులుంది. సహాయక చర్యల్లో అధికారులు, ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని కన్నబాబు కోరారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
టూరిజం కంట్రోల్ రూమ్‌లు ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించారు. నదీతీర ప్రాంతాలైన శింగనపల్లి ( పశ్చిమ గోదావరి), గండి పోచమ్మ (తూర్పు గోదావరి), పేరంటాలపల్లి( పశ్చిమ గోదావరి), పోచవరం( పశ్చిమ గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), రుషికొండ ( విశాఖపట్నం), నాగార్జునసాగర్( గుంటూరు), శ్రీశైలం( కర్నూలు), బెర్మ్ పార్క్ (విజయవాడ)లలో టూరిజమ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్ రూమ్స్ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చదవండి: రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ పీసీ మాట్లాడుతూ.. రుషికొండ వద్ద పర్యాటకుల బోటింగ్‌లపై నిరంత పర్యవేక్షణకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్‌లో టికెట్ కౌంటర్, కంప్యూటీకరణ ద్వారా ఆపరేషన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వైర్ లెస్, ప్రమాదాల నివారణ, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నదిలోకి వెళ్లే ప్రతి బోటు యొక్క ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇకనుంచి పర్యాటకులకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రుషికొండ కంట్రోల్ రూమ్‌లో వివిధ శాఖలకి చెందిన ఆరుగురు అధికారులని నియమించాం' అని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. చదవండి: కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు -
హలో.. కంట్రోల్ రూమ్
నాలుగ్గోడలు లేని ‘లాక్డౌన్’.. వలస కూలీలది! సొంత ఊళ్లకు మైళ్ల దూరంలో.. భాష రాక ఉక్కిరిబిక్కిరౌతున్న బతుకు శ్వాస వాళ్లది. ఆకలౌతోందని.. అనారోగ్యంగా ఉందని.. ఉండటానికి ఇంత చోటు కావాలని.. ఎవర్ని అడగాలి? ఏ భాషలో అడగాలి?! ‘కంట్రోల్ రూమ్’కి సుప్రియ రాక ముందు వరకు.. ఎర్నాకుళంలోని వలసలకూ భాష సమస్య ఉండేది. ఆమెకు ఏడు భాషలు రావడంతో.. వాళ్ల చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటోంది. కేరళలో పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి. దేశంలో లాక్డౌన్ మొదలయ్యాక ఆ పద్నాలుగు జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో పద్నాలుగు ‘కోవిడ్ కంట్రోల్ రూమ్’లను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా గత రెండు వారాలుగా కేరళలో ఉన్న వలస కార్మికుల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఫోన్ చేసి ఎవరైనా ‘ఆకలౌతోంది’ అంటే ఫలానా చోట భోజనం దొరుకుతుంది వెళ్లండి’ అని చెబుతున్నాయి. ‘ఉండటానికి చోటెక్కడైనా ఉందా?’ అని అడిగితే.. ఫలానా ప్రాంతంలో షెల్టర్లు ఉన్నాయి వెళ్లండి’ అని అడ్రెస్ ఇస్తున్నాయి. ‘‘మా ఊరికి ఎప్పట్నుంచి బస్సులు తిరుగుతాయి?’ అని కొందరు అడుగుతుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఫోన్ చేసి, ‘కేరళలో మా వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కుని చెబుతారా?’ అని పలకని ఫోన్ నెంబర్లను ఇస్తుంటారు. కష్టంలో ఉన్న వాళ్లు ఎలాంటి ప్రశ్నలైనా వేస్తారు. కష్టం తీర్చడానికి ఉన్నవాళ్లు ఓర్పుగా సమాధానాలు ఇవ్వాలి. సుప్రియకు ఓర్పుతో పాటు, ఏడు భాషలలో ప్రశ్నలను అర్థం చేసుకుని ఏడు భాషలలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వగల నేర్పు ఉంది. అలాగని ఆమేమీ బహుభాషా ప్రవీణురాలు, కోవిదురాలు కాదు. జీవనోపాధి కోసం స్వరాష్ట్రమైన ఒడిశా నుంచి కేరళకు వచ్చాక పరభాషలను నేర్చుకోవాలన్న ఉత్సాహంతో.. కేవలం ఉత్సాహంతో.. మలయాళం, హిందీ, బెంగాలీ, అస్సామీ, బంగ్లా భాషలను నెట్లో నేర్చుకున్నారు. ఒడియా ఎలాగూ మాతృభాష. ఇంటర్ వరకు చదువుకుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా వచ్చు. అన్ని భాషల్లోనూ రాయలేరు కానీ.. చక్కగా మాట్లాడగలరు. అర్థం చేసుకోగలరు. అన్నీ భాషల్లోనూ ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు. అదొకటి కూడా సుప్రియకు ఉపయోగపడింది. ఎర్నాకుళం కలెక్టరేట్లోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’గా సుప్రియకు రోజుకు 200 వరకు కాల్స్ వస్తుంటాయి. వాళ్ల భాషలో విని, వాళ్ల భాషలో సమాధానం చెప్పగానే వాళ్లు వ్యక్తం చేసే సంతోషానికి అవధులే ఉండటం లేదు. ‘‘కొందరైతే.. నాతో మాట్లాడుతుంటే వాళ్ల ఊళ్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అని పూడుకు పోయిన గొంతుతో కృతజ్ఞతగా అంటుంటారు. వాళ్లు అలా అన్నప్పుడు.. తాత్కాలికంగానే అయినా తగిన ఉద్యోగంలోకే వచ్చానని అనిపిస్తుంటుంది నాకు’’ అంటారు సుప్రియ. వలస కూలీలను కేరళ ప్రభుత్వం ‘వలస అతిథులు’ అంటుం ది. సుప్రియ కూడా అతిథులను ఆహ్వానించినట్లే వాళ్ల ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంటున్నారు. సుప్రియతోపాటు ఆ సెంటర్లో మరో 11 మంది ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’లు పని చేస్తున్నారు. సుప్రియ ‘రోష్ని’లో వాలంటీర్ కూడా. వలస కార్మికుల పిల్లలకు విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకమది. ఇంకా.. మలయిదోంతురుత్లోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు సుప్రియ. ‘సర్వశిక్ష అభయాన్ ప్రాజెక్ట్’ కింద ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉండటం ఎర్నాకుళంలోనే.. పుక్కట్టుపాడి లో. సుప్రియ పూర్తి పేరు సుప్రియా దేవ్నాథ్. ఐదేళ్ల క్రితం భర్తతోపాటు కేరళ వచ్చేశారు. ఆయన పేరు ప్రశాంతకుమార్ సామల్. పెరంబవూర్లోని ప్లయ్ ఉడ్ కంపెనీలో ఉద్యోగం. కూతురు శుభస్మిత.. తల్లి టీచర్‌గా ఉన్న బడిలోనే ప్రి–నర్సరీలో ఉంది. సుప్రియ తన చదువును ఇంటర్‌తోనే ఆపేయాలని అనుకోవడం లేదు. పెరంబువూర్ కాలేజ్‌లో బి.ఎ. హిందీలో చేరబోతున్నారు. అందుకు అవసరమైన సర్టిఫికెట్లు కొన్ని ఒడిశాలోనే ఉండిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో వాటిని తెచ్చుకోవాలని అనుకుంటుండగానే.. ఇదిగో, ఈ లాక్డౌన్! ‘‘ఇంట్లోనే ఉండిపోవడం కష్టమే. అసలు ఇల్లే లేకపోవడం ఇంకా పెద్ద కష్టం అంటారు’’ సుప్రియా.. ‘వలస అతిథుల్ని’ గుర్తుకు తెచ్చుకుని. l -
కరోనా ఎఫెక్ట్... ఏపీ సర్కార్ చర్యలు
-
కరోనా నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అలాగే ఏపీ సచివాలయంలోని ఎన్నాఆర్టీ సెల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు అయింది. ఇక కరోనా కారణంగా విదేశాల్లో అనేక విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి విద్యార్థులు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. (స్వీయ గృహ నిర్బంధమే మేలు) మరోవైపు ఐఏఎస్ అధికారి జేవీ మురళీని రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేటర్‌గా నియమించింది. అలాగే ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి విదేశాంగ శాఖతో సమన్వయం కానున్నారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎప్పుటికప్పుడు హై లెవల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా మంత్రులు ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారు మేడపాటి వెంకట్ ఉన్నారు. ఢిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9871999055 / 9871999059 ఏపీలో కంట్రోల్ రూమ్ నంబర్లు: 8971170178 / 8297259070 -
24 గంటల పాటు అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్
-
బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా బోటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోటు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జలవనరులు, పోలీసు, పర్యాటక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని ఈ కంట్రోల్ రూమ్‌ల్లో నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో 13 మందిని నియమించాలని, అందులో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ నెల 21వ తేదీన ఎనిమిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయానికొచ్చారు. ఈ కంట్రోల్ రూమ్‌లను 90 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం సమీపంలో సెప్టెంబరు 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై విచారణకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను బుధవారం సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్గత జల మార్గాలు.. బోట్ల కదలికలు, వరద ప్రవాహాలు, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కంట్రోల్ రూమ్‌లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. తద్వారా బోట్ల నిర్వహణను సులభంగా పర్యవేక్షించవచ్చని చెప్పారు. బోట్లలో జీపీఎస్ తప్పనిసరి కంట్రోల్ రూమ్‌కు ఎమ్మార్వో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. బోట్లలో ప్రయాణించే వారికి టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ రూమ్లకే కట్టబెట్టాలన్నారు. బోట్లలో జీపీఎస్‌ను తప్పనిసరిగా అమర్చాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోట్లలో మద్యం వినియోగించే అవకాశం ఇవ్వకూడదని స్పష్టంచేశారు. బోటు బయలుదేరడానికి ముందే సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్షలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడగలిగితే.. ఆ మేరకు గ్రేడింగ్ ఇచ్చి, కంట్రోల్ రూమ్‌ల సిబ్బందికి రెండు నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలని సూచించారు. మరోసారి తనిఖీ చేశాకే అనుమతి రాష్ట్రంలో బోట్లన్నింటినీ మరోసారి తనిఖీ చేసి.. వాటి ఫిట్నెస్ను ధ్రువీకరించాకే అనుమతి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. సారంగి, బోటు సిబ్బందికి శిక్షణ, అనుభవం ఉంటేనే లైసెన్సు ఇవ్వాలన్నారు. ఆపరేటింగ్ స్టాండర్ట్ ప్రొసీజర్(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. కంట్రోల్ రూమ్‌లలో సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆదేశించారు. బోట్లను క్రమం తప్పకుండా తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు లేని బోటు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. -
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, మచిలీపట్నంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అవ్వడందో జనజీవనం స్తంభించిపోయింది. మచిలీపట్నంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. వర్షం కారణంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించాల్సిన 2కె రన్ వాయిదా పడింది. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోరుతూ తలపెట్టిన 2కె రన్లో పాల్గొనేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వీపీ సింధు మచిలీపట్నం వచ్చారు. అయితే రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బందరు పట్టణంలోని పట్టణ ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు చేరింది. దీంతో రన్ వాయిదా వేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బి. లక్ష్మీకాంతం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం 08672 - 252847 మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయం 08672 - 252486 గుడివాడ ఆర్డీఓ కార్యాలయం 08674 243697 నూజివీడు ఆర్డీఓ కార్యాలయం 08656-232717 విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866 - 2576217 విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ 0866 - 2474801 -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌లో పలు చోట్లు సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శేరిలింగంపల్లిలో 3 సెం.మీ, బాలానగర్, అమీర్‌పేట్, సరూర్‌నగర్, షేక్ పేటలో 2సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఫోన్ ద్వారా సీఎస్ రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం(ఫోన్ నెంబర్ 040-23454088) ఏర్పాటు చేశారు. -
త్రినేత్రం
సాంకేతికతతో నేరాల నియంత్రణ ప్రతి దృశ్యం... సీసీకెమెరాల్లో నిక్షిప్తం త్వరలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ మహంకాళిలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు ముఖ్యమంత్రితో ప్రారంభానికి యోచన మూడు నెలల్లో నగరమంతటా అమలు అన్ని ఠాణాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్ మహంకాళి మార్కెట్లో ఓ మహిళ న డచి వెళుతోంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన అగంతకుడు కన్నుమూసి తెరిచేలోగా ఆమె మెడలోని బంగారు నెక్లెస్‌ను తెంచుకొని పరారయ్యాడు. కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అరగంట తరువాత ఆమె సెల్‌ఫోన్‌కు పోలీసు స్టేషన్ నుంచి ఫోన్... నగలు దొరికాయనేది సారాంశం. సాధారణంగా ఇలాంటి కేసులు ఎప్పుడో గానీ తేలవు. కానీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దొంగను ఇట్టే పట్టిచ్చింది. ఇటీవల ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా అరగంటలోనే పోలీసులు దొంగను పట్టుకోగలిగారు. త్వరలో నగరమంతటా ఈ తరహా కెమెరాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మన ప్రతి కదలికనూ కనిపెట్టబోతున్నాయి. నేరాలకు చెక్ పెట్టబోతున్నాయి. అంతేకాదు.. కిలోమీటర్ దూరంలోని సూక్ష్మ దృశ్యాలను సైతం స్పష్టంగా చూపించగలిగే ప్రత్యేకత ఈ కెమెరాల సొంతం. ఒక కొత్త వ్యక్తి నగరంలోని ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చి... వె ళ్తే .. కనీసం ఐదు సీసీటీవీలలో ఆ దృశ్యాలు కనబడేలా ఉంటుంది జంట కమిషనరేట్లలోని భవిష్యత్తు చిత్రం. నగరంలోని ప్రతి అంగుళం కవరయ్యేలా మూడు నెలల్లో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలో అమలు చేశారు. 15 రోజుల క్రితం ఐదు కిలోమీటర్ల పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను ఎప్పటికప్పుడు చూసేందుకు ఠాణాలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులోని పెద్ద ఎల్సీడీ టీవీలలో ఠాణా పరిధిలోని ప్రతి అంగుళాన్నీ పోలీసు సిబ్బంది వీక్షించే వీలు కల్పించారు. ఇది సత్ఫలితాలిచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. దీంతో మహంకాళిలో త్వరలో అధికారికంగా సీఎం కేసీఆర్‌తో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ప్రారంభించిన మూడు నెలల్లో జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 160 ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఠాణాలలో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 50 మీటర్ల దూరంలో... మహంకాళి పీఎస్ పరిధిలోని ప్రతి 50మీటర్ల దూరం లో ప్రత్యేకంగా తయారు చేసిన స్తంభాలకు మొత్తం 40సీసీ కెమెరాలను అమర్చారు. ఈ స్తంభాలకు జంక్షన్ బాక్స్(కస్టర్)లు ఏర్పాటు చేశారు. ఒక్కో బాక్స్ లో 16 సీసీ కెమెరాలు కవర్ అవుతాయి. వీటి నిర్వహణ ఖర్చు ఐదేళ్లకు రూ.16 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ఖర్చు... ఎక్కువ ప్రయోజనం కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసే కెమెరాలు, నిర్వహణ ఖర్చు ప్రజలే భరించాల్సి ఉంటుంది. ప్రజా భద్రతా చట్టం కింద ప్రతి వ్యాపారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవడంతో కెమెరాల ఖర్చు, నిర్వహణ భారమవుతుంది. కొత్త ప్రాజెక్ట్‌తో వ్యాపారులకు అతి తక్కువ ఖర్చుతో పాటు నిర్వహణ భారం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రూట్లో 50 మీటర్ల దూరంలోపు ఎడమ, కుడి వైపు కలిసి 40 షాపులుంటే... చట్టప్రకారం వారంతా 40 కెమెరాలు పెట్టాల్సిందే. కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద కేవలం అటువైపు వచ్చి, పోయే మార్గంలోనే కెమెరాలు అమర్చుకోవడంతో ఐదారు సీసీ కెమెరాలు సరిపోతాయి. వీటి ఖరీదులో వ్యాపారి కొద్ది మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. నాణ్యమైనవి... వ్యాపారులు తక్కువ నాణ్యత గల సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గ్రహించిన కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి నాణ్యత గల కెమెరాల కోసం టెండర్లు ఆహ్వానించారు. 18 కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా... అందులో 15 సంస్థలు నాణ్యమైన కెమెరాలు సరఫరా చేయగలవని తేలింది. ప్రభుత్వం తరఫున నిపుణులు, పోలీసు అధికారులు వాటి పనితీరును పరిశీలించి... నిర్ధారించిన వాటిని మాత్రమే కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో కంట్రోల్ రూమ్‌లు జంట పోలీసు కమిషనరేట్లలోని అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటిలో అమర్చిన పెద్ద ఎల్సీడీలలో సీసీ కెమెరాల దృశ్యాలను చూసేందుకు ముగ్గురేసి పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇలా 24 గంటలూ సీసీ కెమెరాలు పని చేస్తుంటాయి.ఇక్కడ అమర్చిన సర్వర్ ద్వారా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేస్తారు. ప్రయోజనాలు.. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోని దృశ్యాలు కావాలనుకుంటే బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో కూర్చునే కమిషనర్ వీక్షించే అవకాశం కల్పించారు. ఇలా ఏ ఠాణా పరిధిలోని ఏ రోడ్డునైనా వీక్షించవచ్చు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, పండుగలు జరుగుతున్న ఏరియాను కమిషనర్ తన కార్యాలయం నుంచే వీక్షించే సదుపాయం. ఇక ఠాణా పరిధిలోని అన్ని గల్లీలు, రూట్లను కవర్ చేస్తూ ప్రణాళిక ప్రకారం సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు. ఆ సెక్టార్ల ఎస్ఐలు ఠాణాల్లోనే కూర్చుని తమ పరిధిలో శాంతి భద్రతలు పర్యవేక్షించవచ్చు. మహిళలు ఇక నిర్భయంగా బంగారు గొలుసులు వేసుకుని తిరుగాడవచ్చు. ఎవరైనా స్నాచింగ్‌కు పాల్పడితే సీసీటీవీలో ఇట్టే గుర్తించవచ్చు. నిందితుడు ఏ రూట్లో... ఏ వాహనంపై వెళ్లాడనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. తద్వారా నేరం మిస్టరీ వెంటనే వీడడంతో పాటు నిందితుడు పట్టుబడేందుకు అవకాశం ఉంటుంది. నేరాలు తగ్గుముఖం పడతాయి. మహిళలను రోడ్లపై వేధించేవారు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని సులువుగా సాక్ష్యాలతో పసిగట్టవచ్చు. నిందితులకు శిక్ష పడేందుకు ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాదాల్లో తప్పొప్పులు దొరికిపోతాయి. షట్టర్ తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే వారిని కనిపెట్టవచ్చు. {పతి ఠాణాలో 30 రోజులు ఈ దృశ్యాలను భద్రపరుస్తారు. ఆ తరువాత ఠాణాల ఫీడ్‌ను ప్రధాన సర్వర్‌లో భద్రపరుస్తారు. ఇదీ కెమెరాల ప్రత్యేకత పైలట్ ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు తైవాన్ దేశానికి చెందినవి. మోటరైజ్ వురిఫికల్ ఫిక్స్డ్ ఐపీ కెమెరా 180 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరిస్తుంది. పీటీజెడ్ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను కవర్ చేస్తాయి. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్‌లో ఈ రెండు కెమెరాలను అమర్చుతారు. ఐపీ కెమెరా 50 మీటర్ల వరకూ... జీటీజెడ్ కెమెరా కిలోమీటర్ దూరం వరకు దృశ్యాలను కవర్ చేస్తాయి. -
'హుదూద్'కు 51 సహాయక బృందాలు
న్యూఢిల్లీ : హుదూద్ తుఫాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్టీఆర్ఎఫ్) 51 సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 బృందాలను తరలిస్తోంది. శ్రీకాకుళం-2, విజయనగరం-1, విశాఖ-1, తూర్పు గోదావరి జిల్లా-1 బెటాలియన్లను పంపుతోంది. విశాఖపట్నం, భువనేశ్వర్ కేంద్రంగా సహాయ కార్యక్రమాలు అందించనుంది. బాధితు ప్రాంతాలకు 162 బోట్లు, 54మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. విశాఖపట్నంలో ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్స్‌ను డీఐజీ పర్యవేక్షించనున్నారు. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని పరికరాలను ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లనున్నాయి. మరోవైపు 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఈ తుఫాను మరింత బలపడనున్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీర, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. -
విశాఖకు నాలుగు మిలటరీ దళాలు
హుదూద్ తుఫాను నేపథ్యంలో విశాఖపట్నానికి కేంద్రప్రభుత్వం నాలుగు మిలటరీ దళాలను పంపింది. విశాఖపట్నం - గోపాల్పూర్ ప్రాంతాలకు మధ్యలో తుఫాను తీరం దాటనున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలో తీవ్ర విలయం సంభవించే ప్రమాదం ఉందన్న సూచనలతో ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు గోదావరి జిల్లాలపై కూడా తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండేలా ఉంది. దాంతో తూర్పుగోదావరి జిల్లాలో తీరం వెంబడి ఉన్న 13 మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలలో కంట్రోల రూంలు ఏర్పాటుచేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి తిరిగి రావాలని తెలిపారు. కాకినాడ పోర్టులోనూ రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. -
నీటమునిగిన ఇళ్లు, పొలాలు:కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలకు ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. భారీనష్టం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ, తూర్పు జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భద్రాద్రి, రాజమండ్రిలో ఇళ్లు నీటమునిగాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 15.6 అడుగులకు చేరింది. 15,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి వరద ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా 1000 హెక్టార్లలో పంట భూములు నీట మునిగాయి. 700 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. ముక్తేశ్వరం కాజ్‌వేపైకి వరదనీరు వచ్చి చేరింది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు నాటుపడవలపై తిరుగుతున్నారు. పి.గన్నవరంలోకి రెండు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. కొత్తూరు కాజ్‌వేపై 4 అడుగుల మేర వరదనీరు వచ్చి చేరింది. 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్ర ఆలయాలు నీట మునిగాయి. ఆచంట, ఎలమంచిలి మండలాలకు వరదముప్పు పొంచి ఉంది. పెరవలి మండలంలో అరటితోట నీటలు మునిగాయి. కనకాయలంక జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముంపు గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు. వరద బాధితుల కోసం అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కొవ్వూరు, నరసాపురం, ఏలూరులలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఏలూరు కలెక్టరేట్ నంబర్ - 08812-230050 ఏలూరు ఆర్డీవో కంట్రోల్ రూమ్ నంబర్- 08812-232044 కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ నంబర్- 08813-231488 నరసాపురం ఆర్డీఓ ఆఫీస్ నంబర్-08814-276699 జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ నంబర్ - 08821-223660 ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు 2 అడుగులు గోదావరిలో నీరు తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 53.7 అడుగులుగా ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన చేశారు. వరదల కారణంగా భద్రాచలం, పినపాక డివిజన్లలో 20 వేల ఎకరాలకు పైగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 578.30 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో: 1,54,158 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 28,430 క్యూసెక్కులుగా ఉంది. ** -
అధికార యంత్రాంగం అప్రమత్తం
= 12 మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు = పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ = పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక మచిలీపట్నం, న్యూస్‌లైన్ : భారీ వర్షాల తాకిడి నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 40,625 ఎకరాల్లో పత్తి, 22,500 ఎకరాల్లో వరి, 1,375 ఎకరాల్లో మొక్కజొన్న, 1,250 ఎకరాల్లో వేరుశనగ, ఐదువేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు. వర్షాలు మరింతగా కురిస్తే ఈ నష్టం పెరిగే అవకాశముందన్నారు. అల్పపీడనద్రోణి ప్రభావం మరో 48 గంటలపాటు ఉంటుందన్నారు. 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా వర్షం తగ్గిన వెంటనే కనీస చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను గ్రామాల్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కోడూరు, ఘంటసాల, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంటే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ కారణంతో వ్యాధిబారిన పడ్డారు తదితర అంశాలను నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను ఎప్పుడూ తెరిచే ఉంచాలని వైద్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో 974 చిన్న బోట్లు ఉండగా వీరంతా సముద్రవేటకు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో చెవిటికల్లు, వత్సవాయి, ఉప్పుటేరు, కీసరపల్లి తదితర ప్రాంతాల్లో లోతట్టుగా ఉన్న కాజ్‌వేల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. పలుచోట్ల దెబ్బతిన్న గృహాలు... జిల్లాలో ఆరు గృహాలు పూర్తిగా, నాలుగు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్ వివరించారు. మచిలీపట్నం, గూడూరు, ఘంటసాల, యండకుదురు, బందరు మండలం మేకవానిపాలెంలో లోతట్టు ప్రాంతాల్లో గృహాల్లోకి నీరు చేరాయన్నారు. మచిలీపట్నంలో రెండు పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 16 మందిని ఉంచినట్లు చెప్పారు. ఈ నీటిని బయటకు పంపేందుకు ఆయిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండటంతో వర్షపునీరు బయటకు పోవటం లేదని, రానున్న రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి పంపామని, వర్షం తగ్గగానే పూర్తిస్థాయి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని జిల్లావాసులకు సూచించారు. విజయవాడలో భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను జేసీ ఉషాకుమారి పర్యవేక్షిస్తున్నారన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యబృందాలు వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో ఇందిరాదేవి, సూపరింటెండెంట్ రాధిక పాల్గొన్నారు. -
ఫైలిన్ తుపాన్ కంట్రోలు రూం నెంబర్లు
విశాఖ : ఫైలిన్ తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారానికి తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. దాంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు. టోల్ ఫ్రీ నం. 08812 230617 తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. టోల్ ఫ్రీ నంబర్లు- 08856 2 33100 గుంటూరు జిల్లా తెనాలి కంట్రోల్ రూమ్ నెంబరు- 08644 223800 నెల్లూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు....నంబర్లు: 1800 425 2499, 08612 331477 శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు .....టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191 ప్రకాశం కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు... టోల్ ఫ్రీ నంబర్లు: 08592 281400 -
ప్రజలకు చేరువయ్యేందుకే కంట్రోల్ రూమ్‌లు: ఎస్పీ
కొత్తవలస, న్యూస్‌లైన్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ కార్తికేయ అన్నారు. కొత్తవలస జంక్షన్లో ఏర్పాటు చేసిన పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సబ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ పోలీసులు ఉంటూ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలిలో ఇటువంటి కంట్రోల్ రూమ్‌లు ప్రారంభించామని చెప్పారు. జిల్లాలో నేరాల అదుపునకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అంతకు ముందు కొత్తవలస పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎస్పీ కృష్ణప్రసన్న ఉన్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ జి.మహేంద్ర, వైస్‌చైర్మన్ ఎంవీఎస్ గిరిబాబు తదితరులు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐ మురళి, ఎస్ఐ బి.రమణయ్య పాల్గొన్నారు.