హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్:
హైదరాబాద్‌లో పలు చోట్లు సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, ఖైరతాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్‌బీనగర్‌లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శేరిలింగంపల్లిలో 3 సెం.మీ, బాలానగర్, అమీర్‌పేట్, సరూర్‌నగర్, షేక్ పేటలో 2సెం.మీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఫోన్ ద్వారా సీఎస్ రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీటి ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం(ఫోన్ నెంబర్ 040-23454088) ఏర్పాటు చేశారు.