సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, మచిలీపట్నంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అవ్వడందో జనజీవనం స్తంభించిపోయింది. మచిలీపట్నంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.
వర్షం కారణంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించాల్సిన 2కె రన్ వాయిదా పడింది. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోరుతూ తలపెట్టిన 2కె రన్‌లో పాల్గొనేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వీపీ సింధు మచిలీపట్నం వచ్చారు. అయితే రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బందరు పట్టణంలోని పట్టణ ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు చేరింది. దీంతో రన్ వాయిదా వేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు.
కంట్రోల్ రూంలు ఏర్పాటు
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బి. లక్ష్మీకాంతం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం 08672 - 252847
మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయం 08672 - 252486
గుడివాడ ఆర్డీఓ కార్యాలయం 08674 243697
నూజివీడు ఆర్డీఓ కార్యాలయం 08656-232717
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866 - 2576217
విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ 0866 - 2474801
Comments
Please login to add a commentAdd a comment