వైఎస్‌ జగన్‌: టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించిన సీఎం‌ | YS Jagan Mohan Reddy Launches Tourism Control Rooms in AP - Sakshi
Sakshi News home page

టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించిన సీఎం‌ జగన్‌

Published Fri, Jun 19 2020 12:20 PM | Last Updated on Fri, Jun 19 2020 4:19 PM

CM YS Jagan Mohan Reddy Launches Tourism Control Rooms - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం ఏపీ ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. శుక్రవారం రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించారు. నదీతీర ప్రాంతాలైన శింగనపల్లి ( పశ్చిమ గోదావరి), గండి పోచమ్మ (తూర్పు గోదావరి), పేరంటాలపల్లి( పశ్చిమ గోదావరి), పోచవరం( పశ్చిమ గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), రుషికొండ ( విశాఖపట్నం), నాగార్జునసాగర్‌( గుంటూరు), శ్రీశైలం( కర్నూలు), బెర్మ్‌ పార్క్‌ (విజయవాడ)లలో టూరిజమ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్‌ రూమ్స్‌ వద్దనున్న కలెక్టర్లను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చదవండి: రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు

ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ పీసీ మాట్లాడుతూ.. రుషికొండ వద్ద పర్యాటకుల బోటింగ్‌లపై నిరంత పర్యవేక్షణకి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్‌లో టికెట్ కౌంటర్, కంప్యూటీకరణ ద్వారా ఆపరేషన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వైర్ లెస్, ప్రమాదాల‌ నివారణ, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. నదిలోకి వెళ్లే ప్రతి బోటు యొక్క ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇక‌నుంచి‌ పర్యాటకులకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రుషికొండ కంట్రోల్ రూమ్‌లో వివిధ శాఖలకి చెందిన ఆరుగురు అధికారులని‌ నియమించాం' అని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ పేర్కొన్నారు. 

చదవండి: కనీస ధరతో పొగాకు కొనుగోళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement