
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) ఏర్పాట్లు చేసింది. స్టేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్‌ల వివరాలను ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్‌బ్రిజ్‌లాల్ వెల్లడించారు. అన్ని యూనిట్లలోనూ ఎస్‌ఈబీ ప్రత్యేకాధికారులుగా ఉన్న ఏఎస్పీలు కంట్రోల్ రూమ్‌లను పర్యవేక్షిస్తారు.
ఎప్పటికప్పుడు గ్రామాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపుతారు. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్: 94910 30853, 0866 2843131తో పాటు జిల్లాల్లోని ఫోన్ నంబర్ల వివరాలు..