
తుఫాను కలిగించిన నష్టం బాధాకరం: పవన్
హుదూద్ తుఫాను విశాఖపట్నానికి కలిగించిన నష్టం చాలా బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆయన కోరారు. క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబుకు ఉన్నాయని ఆయన చెప్పారు.
తుఫాను బాధితుల సహాయార్థం తాను ఇంతకుముందు ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళం తాలూకు చెక్కును ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆపత్కాలంలో అక్కడే ఉండి విశాఖ వాసులకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తుపానువల్ల దెబ్బతిన్న విశాఖను చూస్తే బాధ వేసిందన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పాలనానుభవం ఉన్న వ్యక్తుల అవసరం ఉందని, అందుకే చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని చెప్పారు.