
చంద్రబాబు ప్రశ్నకు పవన్ జవాబు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పవన్ బలంగా వాయిస్ వినిపిస్తున్నాడు. రెండు రోజులుగా వరుస ట్వీట్లతో వేడి పుట్టిస్తున్న పవర్ స్టార్, తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రెండు రోజులుగా వరుస ట్వీట్లతో వేడి పుట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. జల్లికట్టు తరహాలో యువత మౌన ప్రదర్శనకు సిద్దమవుతున్న తరుణంలో జల్లికట్టుకు హోదాకు లింకేంటి..? అన్న బాబు ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పాడు.
బుధవారం కూడా ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేస్తున్న పవన్, 'జల్లికట్టుకి, హోదాకి లింకు ఏమిటి? అన్న ప్రశ్నకు- ఒక సాంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు, మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి. ఆ జల్లికట్టు పోరాట స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు.. కుదిరితే యువతకి సహకరించండి.. అంతే కాని వెనక్కి లాగే వ్యాఖ్యలు చెయ్యకండి' అంటూ ట్వీట్ చేశాడు.