![Pawan Kalyan Fans Attack On Leela Mahal Theatre In Vizag - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/2/vsp2.jpg.webp?itok=ScqLtSvD)
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో పవన్ అభిమానులు బీభత్సం సృష్టించారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా వైజాగ్‌లోని లీలా మహల్ థియేటర్‌లో జల్సా సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్‌లో హంగామా సృష్టించిన పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిల్స్ పగలకొట్టి స్క్రీన్ చించేశారు.
సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్ కూడా డామేజ్ చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment