
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా సురేష్ బాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. వైజాగ్‌లోని జ్యోతి అనే ప్రముఖ థియేటర్‌ను ఆయన అమ్మేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఒకప్పుడు కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్ సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్పా జనాలు థియేటర్లకు రాని పరిస్థితి. ఓటీటీ వినియోగం పెరగిపోవడంతో ప్రేక్షకులు ఇంటికే పరిమితం అవుతున్నారు.
ఇప్పటికే పలు థియేరట్లు మూతపడ్డాయి. తాజాగా సురేష్ బాబు సైతం ఓ థియేటర్‌ను అమ్మేసినట్లు సమాచారం. వైజాగ్‌లో ఐకానిక్ థియేటర్‌గా పేరున్న అలాంటి థియేటర్‌ను సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment