చేసింది గోరంత.. చంద్రబాబు ప్రచారం కొండంత: శ్రీకాంత్ రెడ్డి
చేసింది గోరంత.. చంద్రబాబు ప్రచారం కొండంత: శ్రీకాంత్ రెడ్డి
Published Sun, Oct 26 2014 4:46 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల నుంచి పక్కకు తప్పుకోవడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు.
హుదూద్ తుఫాన్ సహయ చర్యలు ఎవరికీ అందలేదని, ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. తుఫాన్ సహాయ కార్యక్రమంలో విఫలమైన అంశాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకే ఏపీ రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని శ్రీకాంత్ విమర్శించారు.
లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. రూ.30 వేల కోట్లకు కుదించినట్లే.. లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణమని 30 వేల ఎకరాలకు కుదించారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
శ్రీశైలంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను వెంటనే ఆపేయాలని, రుణమాఫీపై చంద్రబాబుకే స్పష్టత లేదన్నారు. తుఫాన్ బాధితులకు చంద్రబాబు గోరంత చేసి, కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. చంద్రబాబు అసమర్ధత కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Advertisement