కల్లబొల్లి మాటలతో చంద్రబాబు మోసం: శ్రీకాంత్ రెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారన్నారు.
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతు రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఐదు సంవత్సరాలు పూర్తయినా.. రుణమాఫీ సాధ్యం కాదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అబద్దపు మాటలతో కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.