porubata
-
ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతంకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపుఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలుప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటంజనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు -
YS Jagan: ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణబాబు సర్కార్‌కు డిమాండ్లురూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణడిసెంబర్ 27వ తేదీన.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమంబాబు సర్కార్‌కు డిమాండ్లుకరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలిజనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి ఇదీ చదవండి: ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు- వైఎస్ జగన్ -
నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
-
పోరుబాట ఉద్రిక్తం.. నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అనంతపురం: కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు నిర్భంధించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను తమ నిర్భందంలో ఉంచుకున్న పోలీసులు.. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై పోరుబాట
అనంతపురం అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరుబాట తప్పదని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. ఇందుకు ఉద్యోగులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ట్రెజరీ హోమ్‌లో ఏపీ హంస (హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా నూతన కార్యవర్గం ఆవిర్భావ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షురాలు కె.చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి యోగేశ్వరెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ మహేంద్రకుమార్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు శీలా జయరామప్ప హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమస్యలపై పోరాటానికి సిద్ధమంటూ నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసులు, పబ్లిసిటీ కార్యదర్శి ఈశ్వరయ్య, ముఖ్య సలహాదారు రామకృష్ణారావు, అసోసియేట్ అధ్యక్షుడు రమేశ్, కర్నూలు, కడప జిల్లాల అధ్యక్షులు రఘుబాబు, రాజారావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హంస జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కె.చాంముండేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా ఎ.రవీంద్ర, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ తిరుపతినాయుడు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరయ్య, పద్మావతి, శిరీష, మేరీ విజయకుమారిని, లక్ష్మిని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా సరస్వతి, నాగేంద్రప్రసాద్, నాగరాజు, నాగమణి, నాగరత్నమ్మ, మేరీసుజాతలను, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహేంద్ర, పబ్లిసిటీ కార్యదర్శిగా కొండా రవిరెడ్డి, కోశాధికారిగా అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులుగా విశ్వనాథ్, సుదర్శన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. -
ప్రజాసమస్యలపై పోరుబాట
అనంతపురం అర్బన్ : ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా చేపట్టాలన్నారు. 31న తహశీల్దారు కార్యాలయాల ఎదట ధర్నాలు నిర్వాహించాలన్నారు. ప్రజాందోళనలో ప్రజలను భాగస్వాములన్ని చేయాలని నాయకులకు సూచించారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో పార్టీ సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లు గడిచినా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, ఆ వర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సొంత ఇల్లు, పింఛను అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి లింగమయ్య, సహాయ కార్యదర్శి శ్రీరాములు, నాయకులు ఈశ్వరయ్య, రమణప్ప, బిందెల నారాయణస్వామి, మహిళ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, నగర కార్యదర్శి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను కలుపుకుని పోరుబాట సాగిస్తామని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్య మోషేన్‌రాజు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 38 మండలాలకు సంబంధించి పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాల కమిటీలను ఎన్నుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయనున్నామన్నారు. టీడీపీ అరాచకాలను, అన్యాయాలను ప్రజలకు వివరించడానికే మండలాల వారీగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. మండల కమిటీలో పనిచేసేందుకు కార్యకర్తలకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ అనుబంధ విభాగాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాలకు కమిటీలు ఎంపిక చేసిన అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగి దుర్గాప్రసాదరాజు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. -
ఐక్యంగా పోరుబాట సాగిద్దాం
ప్రజా ఉద్యమకారులకు విమలక్క పిలుపు కాకినాడలో విప్లవవీరుల సంస్మరణ సభ అలరించిన ‘అరుణోదయ’ సాంస్కృతిక ప్రదర్శనలు కాకినాడ సిటీ : అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా ఉద్యమకారులంతా ఏకమై పోరాడాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళా మందిరంలో గురువారం విప్లవ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ ఒక మందిరంలో జరిగే సమావేశానికి కూడా అనుమతి తీసుకోవాలనడం ఎక్కడా చూడలేదన్నారు. ఈ సంస్మరణ సభకు చివరి వరకూ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. భారత విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని శ్రీకాకుళం రైతాంగ మేఘగర్జన వరకూ ఎంతోమంది విప్లవ వీరులు నవంబర్ బూటకపు ఎన్కౌంటర్లలోనే నేలకొరిగారని ఆమె గుర్తుచేశారు. పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారులను అక్రమ అరెస్టులతో నిర్బంధిస్తూ, ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు చూస్తున్నాయన్నారు. మట్టి మాఫియా : కర్నాకుల ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ హోం శాఖామంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలంలో మట్టి మాఫియా పడగ విప్పిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు తెలుగు మాగాణి సమారాధన పథకంలో కేటాయించిన రామేశంపేట ఎర్రమట్టి కొండల నుంచి తెలుగు తమ్ముళ్లు, మంత్రి అనుచరులు అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మరోపక్క తొండంగి మండలంలో పర్యావరణానికి ముప్పు కలిగించే దివీస్ ఫార్మా కంపెనీకి 550 ఎకరాల భూమిని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ముందుగా సభలో విప్లవ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె.రామలింగేశ్వరరావు, బి.రమేష్ పాల్గొన్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి గార్లదిన్నె : మిడ్ పెన్నార్ (ఎంపీఆర్) డ్యాం కింద ఉన్న ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం సాగునీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమైంది. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో శింగనమల నియోజక వర్గంలోని గార్లదిన్నె, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే మిడ్ పెన్నార్ డ్యాంలో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం అధికార బలం ఉన్నవాళ్లే నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్నే ప్రభుత్వ విప్ యామినీబాల పబ్లిక్ సమావేశాల్లో బలమున్న వాళ్లే నీరు తీసుకొనిపోతున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయకట్టు రైతుల బాధ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడి,్డ అనంతపురము మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సుబ్బిరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమణరెడ్డి,కొండూరు కేశవరెడ్డి, జంబులదిన్నె సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, బండిఆంజనేయులు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల పోరుబాట
‘హైపవర్’ వేతనాల కోసం డిమాండ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మిక మహిళలు గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2013లో జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ కమిటీ (హెచ్పీసీ) వేతనాల కోసం ఇక పెద్ద ఎత్తున ఉద్యమం సాగనున్నారు. అన్ని ఏరియాలలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతృత్వంలో పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం ఇటీవల కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోగా...ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేయూ, ఐఎన్టీయూసీ, బీఐటీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీవీ సంఘాల ఆధ్వర్యంలోని కాంట్రాక్టు కార్మిక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాలుగా హైపర్ కమిటీ వేతనాలు, బోనస్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలోని జీఎం కార్యాలయాల ఎదుట దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంట్రాక్టు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇవీ డిమాండ్లు.... సకలజనుల సమ్మె వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల. ఎన్సీడబ్ల్యూయూ–9లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, అలవెన్స్‌లు, సౌకర్యాలను నిర్ణయించి అమలు చేయాలి. సింగరేణిలో సీఐఎల్ ఆదేశాల ప్రకారం 8.33 శాతం బోనస్‌ను అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలి. ఓబీ డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలి. ఇతర విభాగాల వారిని సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి. సెలవులు, బట్టలు, విద్య, వైద్యం, రక్షణ, నష్టపరిహారం చర్యలు, సౌకర్యాలను అమలు చేయాలి. చట్టబద్ద హక్కులను అమలు చేయాలి. సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్లను వెంటనే కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్‌ను వర్తింపజేయాలి. సింగరేణి లాభాలలో ఇస్తున్న బోనస్‌ను పర్మినెంట్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. -
రజకులు పోరుబాట పట్టాలి
– రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పిలుపు కడప రూరల్ : రాష్ట్రంలోని రజకులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.అంజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చంద్రబాబును, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం నగరంలోని స్కౌట్ హాలులో జిల్లా రజక మహాసభను ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షులు సి.వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మునెయ్య, పి.పార్వతి, పి.కమ్మన్న, పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. -
వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వరా?
‘సార్.. నా భర్త చనిపోయిండు. 19 ఏళ్ల బిడ్డ వికలాంగురాలు. నెలకు ఐదువందల పింఛన్ వచ్చేది. ఆ పింఛన్ సైతం తీసేస్తే ఎట్ల బతుకుతం. మేమేమన్న ఉన్నోళ్లమా. మేమేం పాపం చేసినం చెప్పండి..’ అంటూ హుస్నాబాద్‌కు చెందిన కంసాని అనసూర్య నగరపంచాయతీ కమిషనర్ మార్క సుధాకర్‌ను ప్రశ్నించారు. వంద శాతం వైకల్యం ఉన్న తన బిడ్డను రోడ్డుపై ఉంచి.. ‘ఈమె వికలాంగురాలు కాదా? ఇలాంటి వాళ్లకు పింఛన్ ఇయ్యరా. చెప్పండి సార్’ అంటూ నిలదీసింది. ఇలాగే హుస్నాబాద్ నగరపంచాయతీ ఎదుట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సైతం భారీగా ఆందోళనకు దిగారు. వంటావార్పు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. - హుస్నాబాద్ హుస్నాబాద్ : పింఛన్‌కోసం పేదలు పోరుబాట పట్టారు. ఇన్నాళ్లూ అందుతున్న పింఛన్లను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. వితంతువులకూ అన్యాయం చేసిన కేసీఆర్‌కు తమ ఉసురు తగులుతుందంటూ ఆయన చిత్రపటాన్ని చెప్పులతో దండించారు. హుస్నాబాద్ నగరపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదంటూ అక్కడే వంటావార్పు చేశారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు మద్దతు పలికారు. హుస్నాబాద్‌లో గతంలో 1,735 మందికి పింఛన్లు అందేవి. కొత్తగా 2,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 849మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చారు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళనకు దిగారు. నగర పంచాయతీ కార్యాలయంలోని జాబితాలో పేర్లు లేకపోవడంతో రహదారిపై బైఠాయించారు. చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం తమకు అన్యాయం ఎందుకు చేశారో చెప్పాలం టూ చైర్మన్ సుద్దాల చంద్రయ్య చాంబర్లోకి చొచ్చుకెళ్లారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్నామని, అయినా తొలగించారని ఆగ్రహం వ్యక్తంచే శారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా వారు ససేమిరా అన్నారు. పింఛన్ తొలగించినోళ్లకు తమ ఉసురుతగులుతుందంటూ పాటలుపాడారు. సీఎం కేసీఆర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదుట వంటావార్పు తమకు న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేదిలేదంటూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనాలు చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, బొలిశెట్టి శివయ్య, గురాల లింగారెడ్డి, బొల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, మైదంశెట్టి వీరన్న, వార్డు కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, దండి లక్ష్మి, వాల సుప్రజ, పచ్చిమట్ల ప్రతిభ, చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, బీజేపీ నాయకులు వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, వరయోగుల అనంతస్వామి, కందుకూరి సతీష్, సీపీఐ నాయకులు కొయ్యడ సృజన్‌కుమార్, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు బోజు రవీందర్ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. చైర్మన్ సుద్దాల చంద్రయ్య వచ్చి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అంతకుముందు పట్టణంలోని నాలుగో వార్డులో పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద అధికారులను నిర్బంధించారు. పింఛన్ల పంపిణీలో నిరసనలు పింఛన్లు ఇస్తే అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లెలో స్థానికుడు కరివేద భూంరెడ్డి గ్రామ పంచాయతీకి తాళం వేశాడు. నేదునూర్, గొల్లపల్లి, వచ్చునూర్లో సైతం కొందరు అధికారులను ప్రశ్నించారు. అర్హుల జాబితా నుంచి తమ పేర్లు తొలగించడంపై రామగుండం మండలం బసంత్ నగర్ పరిధిలోని పాలకుర్తిలో 50 మంది వృద్ధులు గ్రామ పంచాయతీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. రాయికల్ మండలంలోని భూపతిపూర్‌లో పింఛన్ల పంపిణీకి వెళ్లిన ఎంపీడీవో గీతను వృద్ధులు అడ్డుకున్నారు. చొప్పదండి మండలంలోని పెద్దకూర్మపల్లిలో పింఛన్ల పంపిణీని గ్రామస్తులు అడ్డుకున్నారు. 47 మంది పింఛన్‌కు అర్హులని జాబితా విడుదల చేయగా నలుగురే లబ్ధిదారులని చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పంపిణీ చేయకుండానే అధికారులు వెనక్కిమళ్లారు. -
ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'పోరుబాట' ధర్నాలు బుధవారం విజయవంతం అయ్యాయని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నివర్గాలనుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారని ఆయన ఎద్దేవా చేశారు. 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రజా ద్రోహానికి పాల్పడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజాగ్రహానికి గురికావద్దని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
కల్లబొల్లి మాటలతో చంద్రబాబు మోసం: శ్రీకాంత్ రెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతు రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఐదు సంవత్సరాలు పూర్తయినా.. రుణమాఫీ సాధ్యం కాదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అబద్దపు మాటలతో కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
అధికారమే లక్ష్యంగా పోరుబాట
ఓట్లు మావే.. సీట్లు మావే నినాదంతో ముందుకు సాగాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పీలేరు, న్యూస్‌లైన్: అధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు పోరుబాట పట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పీలేరు పట్టణంలోని వేర్‌హౌస్ గోడౌన్ ఆవరణలో సోమవారం బహుజనుల సమరభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటు అంటే తెల్లకాగితం కాదని, ఓటంటే ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి సమానమైనదని తెలిపారు. రాజ్యాధికారం ఏ కులం చేతిలో ఉంటే ఆ కులానికి గుర్తింపు, గౌర వం ఉంటుందని తెలిపారు. అణగారిన వర్గాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే నాలుగు స్తంభాలపై పార్లమెంట్ నిలబడి ఉందని అంబేద్కర్ తెలిపారన్నారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఒక గ్రంథం రాసినా ముగింపు ఉండదన్నారు. ఒకట్రెండు శాతాలు ఉన్న వారే ప్రధాని, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారు. దాదాపు 90 శాతం పైగా ఉన్న బహుజనులను భిక్షగాళ్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాదరణను గుర్తించి రాజ్యాధికారమే లక్ష్యంగా అందరం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారం శివాజీ మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలను రాజ్యాంగం ఆశిస్తోందని, పాలక వర్గాలు ఆకలి, అశాంతి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెంచేటట్లు చేస్తున్నాయని ఆరోపించారు. యమలా సుదర్శన్, భాస్కర్‌యాదవ్, పీటీఎం శివప్రసాద్, చమన్, విజయలక్ష్మీ, డాక్టర్ ఇక్బాల్, చింతగింజల శ్రీరామ్ తదితరులు కూడా ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు హాజరయ్యారు. పీలేరు పట్టణంలో ఆటోలతో ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్డు వరకు కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార.