ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి | Ysrcp porubata success statewide, says Ummareddy Venkateswarlu | Sakshi
Sakshi News home page

ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి

Published Wed, Nov 5 2014 6:08 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి - Sakshi

ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'పోరుబాట' ధర్నాలు బుధవారం విజయవంతం అయ్యాయని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నివర్గాలనుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారని ఆయన ఎద్దేవా చేశారు. 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రజా ద్రోహానికి పాల్పడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజాగ్రహానికి గురికావద్దని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement