
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెడన శాసనసభ్యుడు జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం రూ.87 వేల కోట్ల ఖర్చుతో వైకుంఠ ఏకాదశి రోజు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. చదవండి: (ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం)
ఆలయాలపై వరుస దాడుల గురించి స్పందిస్తూ రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని, అయితే దానిపై ప్రతిపక్షాలు లేనిపోని హడావిడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడి జరగకుండా ఉండేందకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment