సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై పోరుబాట
అనంతపురం అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరుబాట తప్పదని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. ఇందుకు ఉద్యోగులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ట్రెజరీ హోమ్‌లో ఏపీ హంస (హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా నూతన కార్యవర్గం ఆవిర్భావ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షురాలు కె.చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి యోగేశ్వరెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ మహేంద్రకుమార్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు శీలా జయరామప్ప హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
సమస్యలపై పోరాటానికి సిద్ధమంటూ నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసులు, పబ్లిసిటీ కార్యదర్శి ఈశ్వరయ్య, ముఖ్య సలహాదారు రామకృష్ణారావు, అసోసియేట్ అధ్యక్షుడు రమేశ్, కర్నూలు, కడప జిల్లాల అధ్యక్షులు రఘుబాబు, రాజారావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హంస జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కె.చాంముండేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా ఎ.రవీంద్ర, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ తిరుపతినాయుడు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరయ్య, పద్మావతి, శిరీష, మేరీ విజయకుమారిని, లక్ష్మిని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా సరస్వతి, నాగేంద్రప్రసాద్, నాగరాజు, నాగమణి, నాగరత్నమ్మ, మేరీసుజాతలను, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహేంద్ర, పబ్లిసిటీ కార్యదర్శిగా కొండా రవిరెడ్డి, కోశాధికారిగా అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులుగా విశ్వనాథ్, సుదర్శన్‌రెడ్డిని ఎన్నుకున్నారు.