
సాక్షి, అనంతపురం: కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు.
పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు నిర్భంధించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను తమ నిర్భందంలో ఉంచుకున్న పోలీసులు.. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment