
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాలోని రొద్దం మండలం తురకలాపట్నంలో జరిగే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే చంద్రబాబు పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజాధనం వృధా అవుతోందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షడుఉ శంకర్ నారాయణ ఆరోపించారు. అనంతలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే అన్నీ చెరువులకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలు నెరవేర్పాలని శంకర్‌నారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment