కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు.