గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.
బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.
డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణ
బాబు సర్కార్‌కు డిమాండ్లు
రూ.20 వేల పెట్టుబడి సహాయం,
ధాన్యానికి మద్దతు ధర,
ఉచిత పంటల భీమా పునరుద్ధరణ
డిసెంబర్ 27వ తేదీన.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం
బాబు సర్కార్‌కు డిమాండ్లు
కరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి
జనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.
బాబు సర్కార్‌కు డిమాండ్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి
ఇదీ చదవండి: ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు- వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment