ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు.
విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు. హుదూద్ తుఫాను ప్రభావంపై ఆయన ఈ సందర్భంగా బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు తుఫాను నష్టం వివరాలతో, రాష్ట్రంలోని పరిస్థితిని రాజ్నాథ్కు వివరించారు. పరిస్థితి అంచనాకు రాజ్నాథ్ సింగ్ను ఆంధ్రప్రదేశ్ రావాలని చంద్రబాబు కోరారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. తుఫాను ప్రభావ పరిస్థితిని వివరించారు.