హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకుగానూ అభినందనలు తెలియజేశారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, అలాగే విభజన హామీలు.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment