నీటిలో చిక్కుకున్న చంద్రబాబు!
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు చేపట్టిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాల్లోని రెల్లిగడ్డి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ నీటిలో చిక్కుకు పోయింది. పార్టీ కార్యకర్తలు, అధికారులు చంద్రబాబు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాల్లో చంద్రబాబు ట్రాక్టర్ పై పర్యటిస్తున్నారు. మొదలవలస, రెల్లిగడ్డి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది.